Red Bananas : ఎర్రటి అరటిలో ఆరోగ్య ప్రయోజనాలు మెండు

ఆరోగ్య నిపుణులు సైతం ఎర్రటి అరటిపండు తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతున్నారు. సాదారణ అరటిపండ్లలో పోషకాలు చాలా ఎక్కువ. అయితే ఎర్రటి అరటి పండులో అంతకు మించి ఉంటాయని న

Red Bananas : ఎర్రటి అరటిలో ఆరోగ్య ప్రయోజనాలు మెండు

Red Banana (1)

Red Bananas : అరటి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. పసుపు పచ్చవి, చక్కెరకేళి, కొండ అరటి పండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం, కర్పూర చక్కెర కేళీ, కూర అరటి ఇలా అనేక రకాలను మన దేశంలో రైతులు సాగుచేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఎర్ర అరటి సాగును రైతులు చేపట్టారు. మనదేశంలో ఎర్ర అరటికి పెద్దగా డిమాండ్ లేకున్నా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా వంటి దేశాల్లో ఈ అరటి పండుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఎర్రటి అరటి పండు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి.

ఆరోగ్య నిపుణులు సైతం ఎర్రటి అరటిపండు తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతున్నారు. సాదారణ అరటిపండ్లలో పోషకాలు చాలా ఎక్కువ. అయితే ఎర్రటి అరటి పండులో అంతకు మించి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయట అంతేకాదు సాధారణ అరటిపండు కంటే చాలా ఎక్కువ బీటా కెరోటిన్ కలిగి ఉంటుందట. బీటా కెరోటిన్ గుండె ధమనులలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. ఎరుపు రంగు అరటిపండు తినడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.

ఎర్ర అరటిపండ్లలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి అహారంగా చెప్పవచ్చు. అరటిపండు తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఈబావనతో అతిగా తినడం మానేస్తారు. ప్రతిరోజూ ఒక ఎర్ర అరటిపండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎరుపు రంగు అరటిపండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సి డెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది కాకుండా విటమిన్ బి6 కూడా ఈ పండు తినడం ద్వారా శరీరానికి లభిస్తుంది. రక్తహీనత లోపాన్ని అధిగమించడానికి విటమిన్ బి6 సహాయపడుతుంది.

ఎర్ర అరటిపండ్లను రోజూ తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా చూడవచ్చు. భోజనం తర్వాత శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ మెరుగుపరచడంలో ఎర్ర అరటి సహాయపడుతుంది. ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్స్ , పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులలో గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఎర్ర అరటిపండ్ల వినియోగం తక్షణ శక్తిని అందిస్తుంది. పండులో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటానికి సహాయపడతాయి. అవి బద్ధకాన్ని నివారించడంలో కూడా సహాయపడతాయి. ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా ఎర్ర అరటి పండును చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.