Healthy Snacks : ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవిగో మీకోసం…

ఎక్కవ కాలంలో నిల్వవుండేందుకు ప్రిజ‌ర్వేటివ్స్ కలుపుతారు. వీటికి బ‌దులుగా వారానికోసారి ఇంట్లోనే ఫ్రూట్ యోగ‌ర్ట్ త‌యారుచేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. రోజూ ఉద‌యాన్నే ఆరోగ్య‌క‌రమైన ఆహారం తీసుకోవ‌డానికి వీలుంటుంది.

Healthy Snacks : ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవిగో మీకోసం…

Snacks

Healthy Snacks : చాలా మంది రుచికరమైన స్నాక్స్ టేస్ట్ చేయాలని కోరికతో ఉంటారు. ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ కి, భోజనానికి మధ్య ఏదో ఒక చిరుతిండి లాగించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే వీరు తినే చిరుతిండ్లు ఒక్కోసారి ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెట్టేవిగా ఉంటాయి. అయితే మనం తీసుకునే స్నాక్స్ ఆరోగ్యానికి మేలు చేసేదిగా ఉండేలా చూసుకోవాలి. రోజువారి బిజీ లైఫ్ లో చాలా మందికి తగినంత సమయం దొరకదు. అలాంటి వారు వారంతాల్లో ఇంట్లోనే రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకుని పెట్టుకుంటే వారం మొత్తం వాటిని నిల్వచేసుకుని తినేందుకు వినియోగించుకోవచ్చు. అయితే అలాంటి వారి కోసం రుచికరమైన, ఆరోగ్యవంతమైన స్నాక్స్ గురించి తెలుసుకుందాం…

1. ఫ్రూట్ యోగర్ట్ ; ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవాల‌నుకునేవారు బజార్లో దొరికే ఫ్రూట్ యోగ‌ర్ట్ కప్పులను కొనుగోలు చేసి తింటుంటారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ ఫ్లేవర్లతో యోగర్ట్ డైరీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిల్లో చ‌క్కెర ఎక్కువ‌గా ఉండ‌డంతో పాటు.. ఎక్కవ కాలంలో నిల్వవుండేందుకు ప్రిజ‌ర్వేటివ్స్ కలుపుతారు. వీటికి బ‌దులుగా వారానికోసారి ఇంట్లోనే ఫ్రూట్ యోగ‌ర్ట్ త‌యారుచేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. రోజూ ఉద‌యాన్నే ఆరోగ్య‌క‌రమైన ఆహారం తీసుకోవ‌డానికి వీలుంటుంది. వీటిలో మనకు నచ్చిన ఫ్లేవర్ లను ఫ్రూట్స్ తో తయారు చేసుకోవచ్చు. ఇలా మ‌న‌కు న‌చ్చిన ఆరోగ్య‌క‌ర‌మైన ప‌దార్థాల‌తో పాటు పండ్ల‌ను కూడా వేసుకోవ‌డం వ‌ల్ల స‌హ‌జ‌మైన తీపిద‌నం పొంద‌వ‌చ్చు. ఫ్రూట్ యోగరాట్ ను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

2. చిలగడ దుంప చిప్స్ ; చాలామందికి సాయంత్రం వేళల్లో చిరుతిండి తినటం అలవాటు. ఇందుకోసం కరకరలాడే స్నాక్స్ తినేందుకు ఇష్టపడుతుంటారు. బంగాళాదుంప చిప్స్ అంటే ఎక్కవ మంది ఇష్టపడతారు. అయితే వాటిని తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో పాటు బరువు పెరిగి ఊబకాయం వస్తుంది. బంగాళాదుంప‌కు బ‌దులుగా.. చిల‌గ‌డ‌దుంప చిప్స్ తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు. వీటిని కూడా నూనెలో వేయించ‌కుండా బేక్ చేసుకుంటే కరకరలాడటాయి. సింపుల్‌గా త్వ‌ర‌గా చేసుకోద‌గిన ఈ చిప్స్‌ని గాలిచొర‌బ‌డ‌ని డ‌బ్బాలో ఉంచితే కొన్నివారాల పాటు నిల్వ ఉంటాయి. మనం తినాలనిపించనప్పుడు కొద్దికొద్దిగా తీసుకోని తినవచ్చు. రుచికి కూడా చాలా బాగా ఉంటాయి.

3. వేపిన శనగలు ; చాలామంది పాప్‌కార్న్ ఎక్కువ‌గా తింటూ ఉంటారు. ఇది ఆరోగ్య‌క‌ర‌మైన‌దే అయినప్పటికీ వీటిల్లో వినియోగించే ఫ్లేవ‌ర్ల వ‌ల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అందుకే పాప్‌కార్న్‌కి బ‌దులుగా వేయించిన శెన‌గ‌లు తీసుకోవ‌డం మంచిది. నాన‌బెట్టిన శెన‌గ‌ల‌ను నూనెలేకుండా వేయించుకోవాలి. తగినంత మసాల కలుపుకుని తీసుకుంటే రుచికరంగా ఉంటాయి. సాయంత్రం స‌మ‌యంలో తీసుకునేందుకు ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్ ను ఇంటి వద్దే సులభంగా రెడీ చేసుకోవచ్చు.

4. పచ్చి మొలకలు ; చిరు ధాన్యాలను నానాబెట్టి మొలకలుగా మారుస్తారు. పచ్చి మొలకలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొంతమంది పచ్చివి తినడం పట్ల అయిష్టత చూపిస్తారు. మరికొందరికి అవి జీర్ణం అవ్వక ఇబ్బంది పడతారు. అలాంటి వారు మొలకలని ఉడకబెట్టి, ఉల్లిపాయ, టమోటా,పచ్చి మిర్చి ముక్కలు కలిపి, కాస్త నిమ్మరసం పిండితే మాంచి రుచికరమైన స్నాక్ సిద్ధమౌతుంది. ఇది చాలా ఆరోగ్యకరంతోపాటు దీనిలో ప్రోటీన్ , ఫైబర్ అధికంగా లభిస్తాయి.

5.డ్రై ఫ్రూట్స్ : జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా, వాల్ నట్స్ ఇలా ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. సూపర్ మార్కెట్లో దొరికే పిస్తా వంటి వాటిలో డ్రై ఫ్రూట్స్ లో సోడియం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని దూరం పెట్టండి. విడిగా కొనుగోలు చేసుకుని ఉప్పు కలపకుండా మీరే వాటిని రెడీ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్లు ,ప్రొటీన్లు ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.