Skin : చర్మం డల్ గా కనిపించటానికి కారణాలు ఇవే!

కొంతమందిలో చర్మం లోపల డీహైడ్రేట్ అయి పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే నీటిని ఎక్కవ మోతాదులో తీసుకోవాలి. ఉదయం, రాత్రి సమయాల్లో చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

Skin : చర్మం డల్ గా కనిపించటానికి కారణాలు ఇవే!

Processed With Vsco With A6 Preset

Skin : అందంగా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలైతే చర్మ సౌందర్యం కోసం మార్కెట్లో లభించే అనేక సౌందర్య ఉత్పత్తులను వాడేస్తుంటారు. అయితే చాలా మందిలో ముఖ చర్మం డల్ గా కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అసలు చర్మం డల్ గా కనిపించటానికి కారణం చర్మంపై మృతకణాలు ఉండటం. దీనికి పరిష్కారం చర్మానికి సున్నితమైన సహజమైన ఫేస్ స్క్రబ్ లను అప్లై చేయటమే.

కాలుష్యం వల్ల చర్మం డల్ గా కనిపిస్తుంది. రోజంతా బయట తిరిగి ఇంటికి వచ్చిన తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చర్మంపై పేరుకు పోయిన దుమ్ము, ధూళి వంటి కాలుష్యకారకాలను తొలగించుకోవాలి. ఇలా చేస్తే చర్మంలో డల్ నెస్ పోతుంది. ఒత్తిడి సైతం చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. చర్మాన్ని రక్తం సరఫరా సరిగ్గా జరగకపోవటమే ఇందుకు కారణం. ముఖాన్ని శుభ్రపరిచే సమయంలో ముఖాన్ని మృదువుగా మసాజ్ చేయాలి. దీని వల్ల చర్మం కాంతి వంతంగా మారుతుంది.

కొంతమందిలో చర్మం లోపల డీహైడ్రేట్ అయి పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే నీటిని ఎక్కవ మోతాదులో తీసుకోవాలి. ఉదయం, రాత్రి సమయాల్లో చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. సూర్యుడి నుండి వెలువడే హానికారక కిరణాల వల్ల చర్మం డల్ గా మారే అవకాశాలు ఉంటాయి. సూర్యకిరణాలు నేరుగా ముఖంపై పడకుండా చూసుకోవటం మంచిది.