ఈ అందమైన భామలు… ఫిట్‌నెస్‌ కోసం ఇలా వర్కౌట్లు చేసేస్తున్నారు..!

  • Published By: sreehari ,Published On : July 14, 2020 / 05:50 PM IST
ఈ అందమైన భామలు… ఫిట్‌నెస్‌ కోసం ఇలా వర్కౌట్లు చేసేస్తున్నారు..!

pageant winners Fitness : అందమైన భామలు.. లేత మెరుపు తీగల్లా ఎప్పుడూ మెరిసిపోతుంటారు.. ఆరోగ్యం కోసం.. ఫిట్ నెస్ కోసం వర్కౌట్లతో తెగ కష్టపడుతుంటారు. అందంగా.. సన్నగా నాజుగ్గా కనిపిస్తుంటారు. సెలబ్రిటీల నుంచి మిస్ ఇండియా విజేతల వరకు అందరూ ఫిట్ నెస్ మంత్రానే జపిస్తుంటారు. తమ శరీరాన్ని అందమైన ఆకారంలోకి మార్చుకునేందుకు కఠినమైన డైట్ తో పాటు వ్యాయామాలు చేస్తుంటారు. ఫిట్ గా ఉండేందుకు అవసరమైన కసరత్తులు కూడా చేసేస్తుంటారు. మిస్ ఇండియా యూనివర్స్ నుంచి మిస్ గ్రాండ్ ఇండియా, యునైటెడ్ కాంటినెంట్స్ ఎందరో అందగత్తెలు తమ ఫిట్ నెస్ గోల్స్ వర్కౌట్లతో బిజీగా గడిపేస్తుంటారు. తమ ఫిట్ నెస్ సీక్రెట్లను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మిస్ భామల వర్కౌట్ సీక్రెట్ ఏంటో ఓసారి చూద్దాం..
Vartika Singh1. మిస్ ఇండియా యూనివర్స్ 2019 వర్తికా సింగ్ (Vartika Singh) తన వర్కౌట్ సెషన్ల ఫోటోలను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. లక్నో అమ్మాయి ఇటీవల తన ఫాలోవర్ల కోసం బాడీ షేప్ మైండ్ ఫిట్ నెస్ ప్రేరణనిచ్చే యోగా భంగిమతో కూడిన ఫోటోను పోస్ట్ చేసింది.
Fitness_Goal_Shivani2. Miss Grand India 2019 శివానీ జాదవ్ (Shivani Jadhav) తన ఫిట్ నెస్ అంటే ఇష్టమని అంటోంది.. తన దృష్టిలో ఫిట్ నెస్ అంటే.. ఫాలోవర్లతో ప్రేమలో పడటమని అంటోంది.. ఈ ఫోటోకు ఆమె క్యాప్షన్‌ పెట్టి షేర్ చేసింది. ‘మీరు మీ శరీరాన్ని ప్రేమించండి.. ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి అంటూ జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది.
Gayatri_3. మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2018 Gayatri Bharadwaj కు హై-ఇంటెన్సిటీ వర్కౌట్ ట్రైనింగ్ అంటే బాగా ఇష్టమట. కండరాల బలంగా మారేందుకు భరద్వాజ్ వారానికి ఒకసారి Electrical Muscle Stimulation (EMS) ను ఉపయోగిస్తానని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోనూ కూడా ఆమె షేర్ చేసింది.
Sanjana Vij4. మిస్ ఇండియా 2019 ఫస్ట్ రన్నరప్ Sanjana Vij తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. తెలంగాణకు చెందిన నీలి కళ్ల సుందరి ఒకసారి తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది.. ‘క్రీడలు ఆడటం వల్ల నన్ను బలంగా, నమ్మకంగా యాక్టివ్ గా ఉండేలా చేశాయి. మీకు కావలసిందల్లా మీ ఆట మార్చడానికి ఫోకస్ పెట్టాలి.. అంకితభావం కృషి కూడా ఉండాలని అంటోంది.
Shraddha5. మిస్ ఇండియా యూనివర్స్ 2017 Shraddha Shashidhar రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి.. స్ప్రింటర్ కూడా. ఆమె తరచూ తన వ్యాయామాలు వర్కౌంట్లకు సంబంధించి వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి తన రోజువారీ వర్కౌట్లు ఫాలోవర్లను ప్రోత్సహించేలా ఉంటుందని అంటోంది.
Meenakshi Choudhary6. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 ఫస్ట్ రన్నరప్.. మిస్ గ్రాండ్ స్లామ్ 2018 Meenakshi Choudhary క్రీడాల అంటే అమితమైన ఇష్టం.. స్విమ్మింగ్ కూడా.. ఫిట్‌గా ఉండటానికి బ్యాడ్మింటన్ కూడా ఆడుతుంది.
Aavriti Choudhary 7. మిస్ దివా సుప్రానేషనల్ 2020 Aavriti Choudhary ఇంట్లో పని చేస్తూనే యోగాను నేర్చుకుంటోంది.. తన జీవనశైలిలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడానికి తన ఫాలోవర్లను మోటివేట్ చేసేలా ఆకర్షణీయమైన వీడియోలను పోస్ట్ చేస్తుంది.
Nehal Chudasama8. మిస్ ఇండియా యూనివర్స్ 2018 Nehal Chudasama ఫిట్నెస్ కన్సల్టెంట్. ఒకప్పుడు అధిక బరువుతో చాలా ఇబ్బందులు పడినట్టు చెప్పుకొచ్చింది. మంచి శరీరాకృతిని సాధించడానికి ఎన్నో వర్కౌట్లు చేసినట్టు చెబుతోంది. వ్యాయామం కోసం తెల్లవారుజామున 4 గంటలకు లేస్తానని అంటోంది. అర్ధరాత్రి వీధుల్లో కూడా జాగ్ చేస్తానని చెబుతోంది.. చుడాసామా తన ఫిట్నెస్ లక్ష్యాన్ని సాధించడానికి తక్కువ కార్బో హైడ్రేట్లు ఉన్న ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నట్టు చెబుతోంది.
Urvi Shetty9. భారతీయ మరో టాప్ మోడల్ సీజన్ 4 విజేత Urvi Shetty ఫిట్‌గా ఉండాలంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది. తరచూ పైలేట్స్, ప్లంక్స్ తో పాటు బ్రిస్క్ వాక్స్ కూడా చేస్తానని అంటోంది. తన వర్కౌట్లకు సంబంధించి ఫొటోలను పోస్ట్ చేస్తుంది.
 Aditi Hundia10. మిస్ ఇండియా 2018 విజేత Aditi Hundia ఫిట్ బాడీ కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్న తెలిపింది. ప్రతిఒక్కరికి శరీరమనేది విలువకట్టలేని ఆస్తిగా చెబుతోంది. అందుకే అందరూ తమ శరీరాన్ని అందంగా ఆరోగ్యంగా ఉండేందుకు నిరంతరం శ్రమించాలని అంటోంది.

ఈ ఫోటోకు ఆమె క్యాప్షన్ కూడా పెట్టింది.. ‘మీ శరీరం మీ అత్యంత అమూల్యమైనది. జర జాగ్రత్తగా చూసుకోండి. ఆహారమనేది ఒక ఇంధనమే.. థెరపీ కాదని అర్థం చేసుకోండి. మీ శరీరాన్ని మీ యజమానిగా ఉండనివ్వండి. శుభ్రంగా తినండి, శుభ్రంగా ఉండండి’ అని చెబుతోంది.