Hair : జుట్టు రాలకుండా ఒత్తుగా ఉండాలంటే ఇలా చేసి చూడండి…

కొబ్బరి నీళ్లను తల మీద మాడు మీద పోసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు కొబ్బరి నీళ్లతో మసాజ్ చేయాలి. 20 నిమిషాల పాటు ఆలా వదిలేయాలి. ఆ తరవాత తే

Hair : జుట్టు రాలకుండా ఒత్తుగా ఉండాలంటే ఇలా చేసి చూడండి…

Hair (1)

Hair : జట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా, వెంట్రుకలు రాలిపోకుండా ఉండాలని చాలా మంది కోరుకుంటుంటారు. ఇందుకోసం ఇటీవలి కాలంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే మారిన జీవనశైలి,వాతావరణ కాలుష్యం, సరైన పోషకాహారం తినకపోవడం వంటి కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు.సాధారణంగా జుట్టు రాలే సమస్య నుండి బయట పడటానికి అనేక రకాల షాంపూలు,నూనెలు వాడుతూ ఉంటాయి. వీటి వల్ల పెద్దగా ఫలితం కన్పించకపోగా జుట్టు ఆరోగ్యానికి సంబంధించి కొత్త సమస్యలను కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యల నుండి బయట పడటానికి కొబ్బరినీళ్లు ఎలా ఎంతోగానో ఉపయోగపడతాయి.

కొబ్బరి నీళ్లను తల మీద మాడు మీద పోసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు కొబ్బరి నీళ్లతో మసాజ్ చేయాలి. 20 నిమిషాల పాటు ఆలా వదిలేయాలి. ఆ తరవాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. కొబ్బరినీళ్ళు, ఆపిల్ సిడర్ వెనిగార్ ను సమాన బాగాలుగా తీసుకోని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తుంటే జట్టు ఒత్తుగా, మెరుపును సైతం సంతరించుకుంటుంది.

ఒక కప్పు కొబ్బరినీటిలో అరచెక్క నిమ్మరసం పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఉండే హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ వలన జుట్టు పెళుసులు పెళుసులుగా ఊడిపోయే సమస్యలు తొలగిపోతాయి. తద్వారా, హెయిర్ ను సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు. అయితే చుండ్రు వలన కూడా హెయిర్ ఫాల్ సమస్య ఉత్పన్నమవుతుంది.. కొబ్బరి నీళ్ళలో డాండ్రఫ్ ని తగ్గించి జట్టు ఊడిపోకుండా కాపాడుతాయి..