High Blood Pressure : ఆందోళన కలిగిస్తున్న చిన్నారుల్లో అధిక రక్తపోటు! జీవనశైలి, ఆహారంలో మార్పులే కారణమా?

అధిక రక్తపోటు ఉన్న పిల్లలో లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. సమస్య పెరిగినప్పుడే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పిల్లల్లో బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. బీపీ పెరిగే కొద్దీ పిల్లలకు ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది కూడా. ఛాతిలో నొప్పితో పాటుగా బిగబట్టినట్టుగా ఉంటడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

High Blood Pressure : ఆందోళన కలిగిస్తున్న చిన్నారుల్లో అధిక రక్తపోటు! జీవనశైలి, ఆహారంలో మార్పులే కారణమా?

high blood pressure

High Blood Pressure : పిల్లలలో అధిక రక్తపోటు అనేది ఇటీవలి కాలంలో పెద్ద సమస్యగా మారింది. అధిక బరువు, పోషకాహార లోపం, రోజువారి వ్యాయామం లేకపోవడం వంటి కారణాలే ఇందు కారణమని నిపుణులు చెబుతున్నారు. హైబీపీ, షుగర్ లాంటి వ్యాధులు చిన్నపిల్లలు పడుతుండటం అందరిని అందోళనకు గురిచేస్తుంది. హైబీపీ వల్ల పిల్లలు ఎన్నో ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక రక్తపోటు ఒకప్పుడు పెద్దవారిలోనే కనిపించేది. 50 ఏండ్ల వయసు దాటిన వారే దీనిబారిన పడతారని ప్రజలు నమ్మే వారు. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు సైతం ఈ అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు హైబీపీ బారిన పడ్డారని గుర్తించలేకపోతున్నారు.

చిన్నారుల్లో హైబీపీ లక్షణాలు ;

అధిక రక్తపోటు ఉన్న పిల్లలో లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. సమస్య పెరిగినప్పుడే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పిల్లల్లో బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. బీపీ పెరిగే కొద్దీ పిల్లలకు ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది కూడా. ఛాతిలో నొప్పితో పాటుగా బిగబట్టినట్టుగా ఉంటడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బీపీ కారణంగా పిల్లలకు ఎప్పుడూ కోపం వస్తుంది. ఎప్పుడు చూసినా కోపంతో ఊడిపోతూనే ఉంటారు. ఈ అధిక రక్తపోటు పిల్లల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా హైబీపీ ఉన్న పిల్లలు బరువు బాగా పెరుగుతారు. హార్మోన్లలో మార్పులు, గుండె సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యల వల్ల పిల్లల్లో హైబీపీ సమస్య వస్తుంది. పిల్లలు తరచుగా మగతగా ఉండటం, తలనొప్పి, అలసటను వంటి బీసీ లక్షణాలు కనిపిస్తాయి.

పిల్లలకు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్ పుడ్ ను పెట్టకూడదు. బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలనే పెట్టాలి. పోషకాలు ఎక్కువగా ఉండాలంటే పండ్లు, కూరగాయలను ఎక్కువగా పెట్టాలి. పిల్లలు బహిరంగా ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం , ఎక్కువ వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులు పిల్లలలో అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. కొంతమంది పిల్లలకు మందులు అవసరం కావచ్చు.