High Bp : బాల్యంలోనే హైబీపీ…నిర్లక్ష్యం చేశారా!

చిన్నారుల్లో అధిక రక్తపోటుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. వంశ పారం పర్యంగా, ఇతరత్ర జబ్బుల కారణంగా, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా హైబీపీ పిల్లల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

High Bp : బాల్యంలోనే హైబీపీ…నిర్లక్ష్యం చేశారా!

Bp

High Bp : అధిక రక్తపోటు సమస్య పెద్ద వయస్సు వారిలోనే కాదు ఇప్పుడు పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతమిది ఆందోళన రేకెత్తించే అంశంగా మారింది. హైబీపిపై సరైన అవగాహనేలేని దశలో వారు దాని బారిన పడి అనేక ఆరోగ్య రుగ్మతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా పెద్దలు వివిధ రకాల ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులు పరీక్షలు నిర్వహించన సమయంలో రక్తపోటు విషయం బయటపడుతుంది. అయితే చిన్నారుల్లో అలాంటి పరిస్ధితి ఉండదు. వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉండవు. దీంతో చిన్నారుల్లో రక్తపోటును గుర్తించటం కష్టతరమౌతుంది.

వాస్తవానికి అనేక మంది పిల్లలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నా గుర్తించలేకపోవటం వల్ల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నారుల్లో అధిక రక్తపోటుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. వంశ పారం పర్యంగా, ఇతరత్ర జబ్బుల కారణంగా, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా హైబీపీ పిల్లల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పదేళ్ళ పైబడిన పిల్లల్లో ఈ తరహా హైబీపీ సమస్యలు వెలుగు చూస్తున్నాయి.

జబ్బులతో సంబంధంలేకుండానే అధిక రక్తపోటు బారిన చాలా మంది పడుతున్నారు. దీనికి కారణం అధిక బరువు, కొలెస్ట్రాల్, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తినటం, ఎక్కవసేపు ఒకేచోట కూర్చోవటం, శారీరక శ్రమ లేకపోవటం వంటివన్నీ దీని కారణంగా నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల జబ్బులు వచ్చిన సందర్భంలో పిల్లల్లో హైబీపి సమస్య ఉత్పన్నం అవుతుంది. ముఖ్యంగా కిడ్నీ ఇన్ ఫెక్షన్లు, మెదడులో రక్తనాళాల్లో సమస్యలు ఉత్పన్నమైన సందర్భంలో పిల్లల్లో రక్తపోటుకు దారితీయవచ్చు.

కొంతమంది పిల్లల్లో రక్తపోటు వచ్చినప్పటికీ అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. డెంగీ, వైరల్ ఫీవర్లు, వంటివి వచ్చిన సందర్భంలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ అధిక రక్తపోటు కారణంగా చిన్నారుల్లో గుండె వైఫల్యం తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల నేపధ్యంలో చిన్నారుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో పిల్లల్లో రక్తపోటుకు సంబంధించిన పరీక్షలను చేయించటం వల్ల భవిష్యత్తులో ముంచుకొచ్చే ఆరోగ్యపరమైన ఉపద్రవాలను ముందే నిలువరించిన వారమౌతాం. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవటం ప్రధానం.