rama phal : అధిక పోషకవిలువలు కలిగిన రామాఫలం

ఈ పండు తినటం వల్ల లభించే కొవ్వు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. చర్మకాంతిని పెంచుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. సహజ యాంటీ బయాటిక్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణం కలిగిన రామాఫలం వ

rama phal : అధిక పోషకవిలువలు కలిగిన రామాఫలం

Rama Palam

rama phal : సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం ఈ పేర్లు మీరు వినే ఉంటారు. వీటిలో తెలుగు ప్రజలకు ఎక్కువ తెలిసింది మాత్రం సీతాఫలమనే చెప్పవచ్చు. అయితే సీతాఫలం కంటే మిన్నగా పోషకాలుండే పండు మాత్రం రామఫలమనే చెప్పవచ్చు. ఈ పండు అమెరికా, ఐరోపా దేశాల్లో ఎక్కువగా పండుతుంది. ఈ మధ్యకాలంలోనే తెలుగు రాష్ట్రాలలోపాటు కర్ణాటక, తమిళనాడు. కేరళ రాష్ట్రాల్లో రామఫలాలు అందుబాటులోకి వచ్చాయి.

సీతాఫలంతో పోలిస్తే ఇందులో గింజలు చాలా తక్కువగా ఉండి పోషకాలు అధికంగా లభిస్తాయి. వంద గ్రా. రామాఫలం నుంచి 75 క్యాలరీల శక్తి, 17.7గ్రా. కార్బొహైడ్రేట్లు, 1.5గ్రా. ప్రొటీన్లు, 3గ్రా. పీచూ లభ్యమవుతాయి. శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, కొవ్వు, ప్రోటీన్, విటమిన్ బి1, బి2, బి5, బి3, బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం ఇలా ఎన్నో పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

తీపి విషయానికి వస్తే సీతాఫలం కన్నా రామాఫలంలో తియ్యదనం తక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును తినొచ్చు. ఇందులోని పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.
రామాఫలంలోని విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి ముఖంపై మొటిమలను నివారిస్తాయి.

ఇందులో సి- విటమిన్‌తో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్‌ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపటంలో ఇది ఉత్తమంగా పనిచేస్తుంది.

ఈ పండు తినటం వల్ల లభించే కొవ్వు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. చర్మకాంతిని పెంచుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. సహజ యాంటీ బయాటిక్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణం కలిగిన రామాఫలం విరేచనాలను నియంత్రిస్తుంది. న్యుమోనియా, టైఫాయిడ్ వంటి అనారోగ్యాలకూ ఔషధంగా పనిచేస్తుంది. వీటిలో ఉండే పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కండరాల పెరుగుదలకు దోహదం చేస్తుంది. కాల్షియం ఎముకలకు సత్తువనిస్తుంది.

రామాఫలం చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది. దీని గుజ్జును ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే నలుపు మచ్చలు పోతాయి. రామాఫలంలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పేగులను శుభ్రం చేసి జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దురద తగ్గించడంలో, చర్మ సంరక్షణలో, వార్ధక్య ఛాయలను నియంత్రించడంలో రామాఫలం ఔషధంగా పనిచేస్తుంది.