Fitness Workouts : ఇంటి వ్యాయామాలు vs జిమ్ వర్కౌట్‌లు వీటిలో ఏది సరైనది?

జిమ్‌కి వెళ్లడం అనేది రోజువారి దినచర్యగా మారడంతో వ్యాయామం చేయడానికి గొప్ప ప్రేరణ కలిగిస్తుంది. జిమ్ లో వ్యాయామాలు చేస్తూ ఇతర వ్యక్తుల చుట్టూ ఉండటం వల్ల ఫిట్ నెస్ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది.

Fitness Workouts : ఇంటి వ్యాయామాలు vs జిమ్ వర్కౌట్‌లు వీటిలో ఏది సరైనది?

Gym workouts vs home workouts

Fitness Workouts : ఫిట్‌నెస్ విషయంలో ఇంటి వ్యాయామాలు, జిమ్ వర్కౌట్‌ల మధ్య చర్చ కొనసాగుతుంది. జిమ్‌లలో వివిధ రకాల పరికరాలతోపాటు, వ్యాయామానికి అనుగుణమైన వాతావరణాన్ని అందిస్తున్నప్పటికీ, గృహ వ్యాయామాలు సౌలభ్య కరగంగా ఉండటంతోపాటుగా, బయటి వారు చూడకుండా వ్యాయామాలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

READ ALSO : Watermelon : వేసవిలో శరీరాన్ని చల్లగా,ఆరోగ్యంగా ఉంచే పుచ్చకాయ !

జిమ్ వర్కౌట్‌లు ఫిట్‌నెస్ ఔత్సాహికులకు అదరణ పొందుతున్నాయి. ఎందుకంటే అక్కడ వ్యాయామాలకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంటాయి. అందుకే ఎక్కువ మంది జిమ్ వర్కౌట్ ల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. జిమ్ లో స్నేహితులతో కలిసి ఉత్సాహంగా వ్యాయామాలు చేయటనాకి అవకాశం ఉంటుంది. వ్యాయామాలు చేయటంలో ఆరోగ్య కరమైన పోటీ ఉంటుంది.

హోమ్ వర్కౌట్‌లు vs జిమ్ వర్కౌట్‌లతో లాభాలు మరియు నష్టాలు ;

1. అందుబాటులో పరికరాలు : జిమ్‌కు వెళ్లడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఇది ఒకటి, జిమ్ లో వివిధ రకాల పరికారాలు అందుబాటులో ఉండటం వల్ల వ్యాయామాలు చేయటం సులభంగా ఉంటుంది. బరువులు ఎత్తే పరికరాలు, కార్డియో మెషీన్‌లు, ట్రెడ్‌మిల్, ఎలిప్టికల్, స్టెయిర్‌క్లైంబర్, స్టెయిర్ స్టెప్పర్, స్టేషనరీ బైక్ లేదా రోయింగ్ మెషీన్ వంటి కొత్తకొత్త పరికరాలు అందుబాటులో ఉంటాయి. వీటితో వ్యాయామం చేయటం చాలా సులభం అవుతుంది.

READ ALSO : Meditation In Summer : వేసవిలో ధ్యానం వల్ల శరీరం చల్లబడటంతోపాటు అనేక ప్రయోజనాలు !

2. సౌలభ్యంకరంగా ; ఇంటి వ్యాయామాలు సౌలభ్యకరంగా ఉంటాయి. ఇంట్లోనే ఉంటూ కావలసినప్పుడు వ్యాయామాలు చేయవచ్చు. బిజీ షెడ్యూల్‌తో గడిపేవారు, జిమ్‌కి వెళ్లటానికి సమయం కేటాయించలేని వారు ఇంట్లో వీలు దొరికన సమయంలో వ్యాయామాలు చేసేందుకు వీలుంటుంది. జిమ్ కు వెళ్ళేందుకు సమయం పడుతుంది. అంతే కాకుండా అక్కడ పరికరాలతో వ్యాయామాలు చేసేందుకు వేచి ఉండాల్సిన పరిస్ధితి ఉంటుంది.

3. ప్రేరణ కలిగిస్తుంది : జిమ్‌కి వెళ్లడం అనేది రోజువారి దినచర్యగా మారడంతో వ్యాయామం చేయడానికి గొప్ప ప్రేరణ కలిగిస్తుంది. జిమ్ లో వ్యాయామాలు చేస్తూ ఇతర వ్యక్తుల చుట్టూ ఉండటం వల్ల ఫిట్ నెస్ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. జిమ్‌లో వ్యాయామం చేసే సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్ధితులు ఉండవు. ఇంటి పనులు పిల్లలు మధ్యలో అంతరాయం కలిగించటం వంటివి ఉండవు.

READ ALSO : Benefits Of Aloe vera : వేసవిలో కలబందను ఉపయోగించటం వల్ల కలిగే ప్రయోజనాలు !

4. వ్యక్తిగత శిక్షణ: అనేక జిమ్‌లలో వ్యక్తిగత శిక్షకులు అందుబాటులో ఉంటారు. కొన్ని రకాల వ్యాయామాలు వారి పర్యవేక్షణలో చేయటం మంచిది. నిర్దిష్ట అవసరాలు,లక్ష్యాలకు చేరటానికి వ్యాయామ ప్రణాళికను రూపకల్పన చేయటంలో వ్యక్తిగత శిక్షకుడు మీకు సహాయపడతాడు.

5. సామాజిక పరమైన తోడ్పాటు : జిమ్‌కి వెళ్లడం వల్ల అక్కడ కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అందరూ కలిసి కట్టుగా ఫిట్‌నెస్ క్లాస్ ల గురించి అవగాహ పొందవచ్చు. వ్యాయామశాలలో సహచరులందరితో కలిసి సరదాగా వ్యాయామాలు చేయవచ్చు.

ఇంట్లో వర్కౌట్‌లు సౌకర్యవంతంగా ఉంటాయి, అయితే జిమ్ ఉండే పరికరాలు, వాతావరణం ఇంట్లో లభించకపోవచ్చు. అంతిమంగా, హోమ్ వర్కౌట్‌లు, జిమ్ వర్కౌట్‌లలో ఏది మంచిదన్నది వ్యక్తిగత ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. ఫిట్‌నెస్ గురించి తీవ్రంగా ఆలోచించే వారికి జిమ్‌కి వెళ్లడం గొప్ప ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు.