Tapeworms Home Remedies : మనుషులలో ఆరోగ్యసమస్యలను తెచ్చిపెట్టే బద్దె పరుగుల నివారణకు హోం రెమిడీస్!

పైనాపిల్స్‌లో సిస్టీన్ ప్రొటీనేసెస్ అని పిలువబడే ప్రోటీన్ డిగ్రేడింగ్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి టేప్‌వార్మ్ క్యూటికల్‌లను జీర్ణం చేయడంలో సహాయపడతాయి, టేప్‌వార్మ్‌ల నుండి రక్షణ కవచంగా తోడ్పడతాయి.

Tapeworms Home Remedies : మనుషులలో ఆరోగ్యసమస్యలను తెచ్చిపెట్టే బద్దె పరుగుల నివారణకు హోం రెమిడీస్!

tapeworms

Tapeworms Home Remedies : బద్దె పురుగు దీనినే టేప్‌వార్మ్ అంటారు. ఎలాంటి ఇన్‌ఫెక్షన్, స్పష్టమైన లక్షణాలు లేకుండా శరీరంలో అనేక మార్పులను కలుగజేస్తుంది. బరువు తగ్గడం, కడుపులో నొప్పి వంటి సమస్యలతోపాటు, లార్వా మెదడులోకి ప్రవేశించి మూర్ఛసంబంధిత సమస్యలకు కారణమౌతుంది. టేప్ వార్మ్ చాలా ప్రమాదకరమైనది. దీని విషయంలో జాగ్రత్తలు పాటించటం మంచిది. కొన్ని సాధారణ ఇంటి నివారణలతో సమస్యను మొగ్గలోనే తుడిచివేయడం మంచిది. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా టేప్‌వార్మ్ ను నివారించవచ్చు.

1. బొప్పాయి ;బొప్పాయి, దాని రసం యాంటీపరాసిటిక్. సహజంగా టేప్‌వార్మ్‌లను వదిలించుకోవడానికి మంచిది. బొప్పాయి పాలు పరాన్నజీవి పురుగులతో పోరాడే ఒక శక్తివంతమైన యాంటెల్మింటిక్. అందువల్ల టేప్‌వార్మ్‌లను చంపిటంతోపాటు శరీరానికి ఎటువంటి హాని కలగకుండా చేస్తుంది. అయితే బొప్పాయి పాలు వినియోగించటం కొందరిలో గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా గర్భిణీస్త్రీలు వైద్యులను సంప్రదించిన తరువాతనే ప్రయత్నించటం మంచిది.

ఎండిన బొప్పాయి గింజలు కూడా పేగులలో ఉన్న పరాన్నజీవులపై గణనీయమైన యాంటీపరాసిటిక్ చర్యను కలిగి ఉంటాయి. గింజలను గ్రైండ్ చేసి, రెండు టీస్పూన్ల సీడ్ పౌడర్‌లో కొంచెం తేనె కలిపి ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ప్రత్యామ్నాయంగా, కొబ్బరి పాలు, బొప్పాయి పండు, ఎండిన గింజల పొడి స్మూతీని తయారు చేసి తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2. పైనాపిల్ ; పైనాపిల్స్‌లో సిస్టీన్ ప్రొటీనేసెస్ అని పిలువబడే ప్రోటీన్ డిగ్రేడింగ్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి టేప్‌వార్మ్ క్యూటికల్‌లను జీర్ణం చేయడంలో సహాయపడతాయి, టేప్‌వార్మ్‌ల నుండి రక్షణ కవచంగా తోడ్పడతాయి. కొన్ని రోజులు తాజా పైనాపిల్ జ్యూస్ త్రాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వల్ల బద్దె పురుగులను నివారించుకోవచ్చు. పైనాపిల్స్ నుండి రసాన్ని రోజంతా లేదా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

3. వెల్లుల్లి ; పచ్చి వెల్లుల్లి నూనెలో యాంటీపరాసిటిక్ లక్షణాల వల్ల టేప్‌వార్మ్ ఇన్‌ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించవచ్చు. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు ఈ చర్యకు కారణమని భావిస్తున్నారు. ఉదయం పూట ఖాళీ కడుపుతో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను పాలలో చూర్ణం చేసి, మరిగించి, ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇలా ఒక వారం వరకు కొనసాగించటం వల్ల బద్దె పురుగులను నివారించవచ్చు.

4. లవంగాలు ; లవంగాలు క్రిమిసంహారకంగా అనే పరిశోధనల్లో తేలింది. తాజా వెల్లుల్లి కంటే లవంగం పొడి 4.5 రెట్లు ఎక్కువ శక్తివంతమైనదని పరిశోధకులు కనుగొన్నారు. టేప్‌వార్మ్‌ల నివారించటానికి లవంగాలను పొడి చేసి ఈ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో వేడి నీటిలో మరగనివ్వాలి. దీనిని వారం రోజుల పాటు సేవించటం వల్ల బద్దెపురుగు గుడ్లను నాశనం చేయటంతోపాటు పురుగులను చంపడానికి తోడ్పడుతుంది.

5. గుమ్మడికాయ గింజలు ; టైనియాసిస్ అనేది టేప్‌వార్మ్‌ల వల్ల వచ్చే జీర్ణవ్యవస్థ వ్యాధి. టెనియాసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులకు గుమ్మడికాయ గింజలను అందించటం ద్వారా బద్దె పురుగులను నివారించవచ్చు. పచ్చి గుమ్మడికాయ గింజలను పరగడుపున తీసుకోవటం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. శిక్షణ పొందిన ప్రకృతివైద్యుల సమక్షంలో తీసుకోవటం మంచిది. కొబ్బరిపాలతో కలిపి ఈ గింజలను తీసుకోవటం ద్వారా బద్దె పురుగుల నివారించవచ్చు.