Dandruff Treatments: డాండ్రఫ్ నివారించేందుకు ఇంటి చిట్కాలు

పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడులు కారణంగా నగర జీవనంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య చుండ్రు. ఒకరి దువ్వెన మరొకరు వాడుకోవడం వల్ల, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల ఈ సమస్య కనిపించొచ్చు. మరి చుండ్రు సమస్య వస్తే ఏం చేయాలి. ఎలా దీని నుంచి బయటపడాలనేది తెలుసుకుందాం.

Dandruff Treatments: డాండ్రఫ్ నివారించేందుకు ఇంటి చిట్కాలు

Dandruff

 

 

Dandruff Treatments: పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడులు కారణంగా నగర జీవనంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య చుండ్రు. ఒకరి దువ్వెన మరొకరు వాడుకోవడం వల్ల, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల ఈ సమస్య కనిపించొచ్చు. మరి చుండ్రు సమస్య వస్తే ఏం చేయాలి. ఎలా దీని నుంచి బయటపడాలనేది తెలుసుకుందాం..

* ఆలివ్ ఆయిల్ వాడితే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. తద్వారా హెయిర్ ఫోలికల్స్‌కు పోషణ అందిస్తాయి.

* ప్రాసెస్‌డ్ ఫుడ్, జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే తీపి పదార్థాలను తినడం, అధికంగా మద్యం సేవించడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. ఈ పదార్థాలకు దూరంగా ఉంటే చుండ్రును తగ్గించుకోవచ్చు.

* ఒత్తిడిని దరి చేరనివ్వకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

* రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను షాంపూ లేదా కొబ్బరినూనెలో కలిపి కొంత సేపటికి తలస్నానం చేయాలి.

* ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలు, అవిసె విత్తనాలు, వాల్‌నట్స్ తింటే వెంట్రుకల సమస్యలన్నీ పోతాయి.

* బేకింగ్‌ సోడాను తలపై పోసి మర్దనం చేయాలి.

Read Also : వేపతో చుండ్రు నుండి జుట్టు సంరక్షణ ఎలాగంటే!..

* ఆస్ప్రిన్‌ మాత్రలు రెండింటిని పొడిచేసి రెగ్యులర్‌ షాంపూతో కలిపి తలకు మర్దనం చేయాలి. 2-3 నిమిషాల తర్వాత కడిగేయాలి.

* పెరుగును వెంట్రుకల మొదళ్ల వరకు వెళ్లేలా పూయాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత నీటితో కడగాలి.

* నిమ్మరసం జుట్టు మొదళ్ల వరకు వెళ్లేలా రాసి 2,3 నిమిషాలు ఆరబెట్టి షాంపూతో కడగాలి.

* అలోవెరా చర్మం చికాకును తగ్గించడమే కాకుండా మాయిశ్చరైజింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

* మెంతి గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండి జుట్టు పొడిబారడం, రాలడాన్ని, చుండ్రును నివారిస్తాయి.