Hot Water : అజీర్ణ సమస్యలు తొలగించే గోరువెచ్చని నీరు!

శ్వాస, గొంతు సంబంధిత సమస్యలు బాధ పెడుతున్నప్పుడు వేణ్నీళ్లు తాగాలి. దానితో హాని చేసే ఇన్ ఫెక్షన్లు నశిస్తాయి. తెమడ కూడా త్వరగా బయటికొచ్చి ఉపశమనం లభిస్తుంది.

Hot Water : అజీర్ణ సమస్యలు తొలగించే గోరువెచ్చని నీరు!

Hot Water

Hot Water : రోజులో ఓగ్లాసు వేణ్నీళ్లు తీసుకుంటే మంచి దంటున్నారు వైద్య నిపుణులు. రోజూ ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికెంతో మేలు జరుగుతుంది. ఉదయం లేవగానే చాలామంది గోరువెచ్చని నీళ్లు తాగుతారు. భోజనం చేశాక తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అరుగుదలలో ఇబ్బందులుండవు. శరీరంలో రక్తప్రసరణ బాగుంటుంది. చిన్నారులకు కూడా వేణ్నీళ్లు తాగే అలవాటు చేయడం మంచిది. చురుగ్గా ఉంటారు. తలనొప్పి, లో బిపి, కీళ్ల నొప్పులు, హర్ట్ బీట్, కొలెస్ట్రాల్ పెరుగుదలను, ఆస్తమా, పొడి దగ్గు, దగ్గు, కడుపు, కంటి, సమస్యలు దరి చేరకుండా ఉండేందుకు గోరువెచ్చని నీరు ఉపయోగపడుతుంది.

శ్వాస, గొంతు సంబంధిత సమస్యలు బాధ పెడుతున్నప్పుడు వేణ్నీళ్లు తాగాలి. దానితో హాని చేసే ఇన్ ఫెక్షన్లు నశిస్తాయి. తెమడ కూడా త్వరగా బయటికొచ్చి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయినప్పుడురకరకాల సమస్యలు బాధిస్తాయి. గోరువెచ్చని నీళ్లు తాగడంతో ఈ వ్యర్థాలను దూరం చేసుకోవచ్చు. చర్మ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. రోజూ మనం తీసుకునే గ్లాసు వేణ్నీళ్లలో నాలుగైదు చుక్కల నిమ్మరసం కలపడం వల్ల చర్మానికి కొత్త కళ వస్తుంది.

నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుం నొప్పి బాధిస్తున్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఉదయం పూట తాగడం వల్ల జీవక్రియల రేటు వృద్ధి చెందు తుంది. రాత్రి పడుకునే ముందు తాగితే హాయిగా నిద్రపడుతుంది. గోరువెచ్చని నీటిని తీసుకోవటం వలన మలబద్దకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్‌ తేనె, వేయించిన వాము కలిపి తాగితే అజీర్ణం వల్ల వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది.