Instagram Storyలో Photoతో బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చాలంటే?

  • Published By: sreehari ,Published On : December 31, 2019 / 09:59 AM IST
Instagram Storyలో Photoతో బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చాలంటే?

మీకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు, వీడియోలను ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. స్టోరీలతో ఈజీగా ఫాలోవర్లను పెంచుకోవచ్చు. తమ స్నేహితులందరితో తాత్కాలికంగా ఫొటోలను షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. వీరిలో క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే షేర్ చేసేలా సెట్ చేసుకోవచ్చు. లేదంటే తమ అకౌంట్లో ఫొటో పోస్టింగ్ చేయకుండా నిరాకరించవచ్చు.

ఇన్ స్టాగ్రామ్ స్టోరీల్లో మీ స్టోరీ ఫీడ్‌కు బదులుగా ఇతరుల స్టోరీలను కూడా హోంపేజీలో చూడవచ్చు. అయితే, ఇన్ స్టాగ్రామ్ స్టోరీలను ఎన్నో విధాలుగా కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంది. అందులో ఒకటి iPhone 3D లేదా Haptic Touch ద్వారా మార్పులు చేసుకోవచ్చు. ఇతర ఆప్షన్లలో మీ స్టోరీలో music పెట్టుకోవచ్చు లేదా ఏదైనా ఒక Link కూడా యాడ్ చేసుకోవచ్చు.

2015లో iPhone 6S రిలీజ్ అయినప్పటి నుంచి 3D Touch అనే ఆప్షన్ ఇన్ స్టాగ్రామ్ యూజర్ల కోసం ప్రవేశపెట్టింది. యూజర్లు తమ iPhone Screenపై వివిధ కమాండ్స్ నొక్కడం ఆధారంగా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ సహా మరిన్నో యాప్స్ కు 3D Touch ఆప్షన్ ఇంటిగ్రేటింగ్ చేయడం జరిగింది.

అప్పటినుంచి అవసరమైన ఫీచర్ల స్థానంలో మరిన్ని కొత్తవి వచ్చి చేరాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే ఐఫోన్లలో Haptic Touch అనే ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. మీరు పోస్టు చేసిన Instagram స్టోరీలో Background మార్చాలనకుంటున్నారా? అయితే, 3D Touch లేదా Haptic Touch ఫీచర్ వాడండి.. దీని ద్వారా ఈజీగా డిఫాల్ట్ కలర్ మార్చేసి దాని స్థానంలో మీరు ఎంపిక చేసిన కలర్ సెట్ చేసుకోవచ్చు.

Background కలర్ మార్చుకోవాలంటే? :
* Instagram App ఓపెన్ చేసి Log in అవ్వండి.
* మీ అకౌంట్లోని ఏదైనా ఫొటోను సెలెక్ట్ చేయండి.
* Your Storyలో Add చేసేందుకు ఎంపిక చేసిన ఫొటోపై క్లిక్ చేయండి.
* ఫొటో కిందిభాగంలో aeroplane అనే Paper icon పై Click చేయండి.
* ఇక్కడ మీకో Pop-Up కనిపిస్తుంది.
* Your Storyలో Add Postలో ఆ ఫొటో యాడ్ చేయండి.
* ఇది.. ఆటోమాటిక్‌గా ఒక స్టోరీని క్రియేట్ చేస్తుంది. 
* ఫొటోలో మెయిన్ కలర్ అంతా గ్రేడియంట్ కలర్ (డిఫాల్ట్ బ్యాగ్ గ్రౌండ్)లో కనిపిస్తుంది.
* Top-Right కార్నర్ దగ్గర Pen Icon పై క్లిక్ చేసి Color మార్చుకోవచ్చు.
* కిందిభాగంలో మీకు కనిపించే కలర్ ప్యాలెట్ నుంచి నచ్చిన రంగును సెలెక్ట్ చేయండి.
* ఫొటోలోని కలర్ కు మ్యాచ్ అయ్యేలా hue కలర్ ఎంచుకోవచ్చు. 
* కలర్ డ్రాప్ సింబల్ పై Click చేయండి.
* ఆ తర్వాత మీ చేతివేలిని ఫొటోపై డ్రాగ్ చేస్తూ కలర్ సెట్ చేయండి.
* నచ్చిన కలర్ సెట్ చేయగానే.. మీ చేతి వేలిని తీయండి.
* 3D Touch ద్వారా గ్రేడియంట్ బ్యాక్ గ్రౌండ్ పై నొక్కండి (ఫొటో బయటివైపు భాగంలో ఎక్కడైనా)
* ముందుగా ఎంపిక చేసిన రంగు బ్యాగ్ గ్రౌండులోకి మారిపోతుంది.
* కొత్త బ్యాక్ గ్రౌండ్ కలర్ సరే అనుకుంటే వెంటనే Done పై Tap చేయండి.
* Your స్టోరీని Textతో లేదా Gifs కూడా Linking చేసుకోవచ్చు.