COVID-19 Spread : కరోనా ఇంత వేగంగా ఎలా వ్యాపించింది..? ‘వైరల్ న్యుమోనియా’ అధికంగా మనుషుల్లోనే..!

ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనావైరస్ మహమ్మారి ఇంత వేగంగా మనుషుల్లోకి ఎలా వ్యాపించింది? చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ అంతుపట్టని వైరల్ న్యుమోనియా కొవిడ్-19 మహమ్మారిగా ఎలా రూపుదాల్చింది అనేదానిపై రీసెర్చర్లు లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

COVID-19 Spread : కరోనా ఇంత వేగంగా ఎలా వ్యాపించింది..? ‘వైరల్ న్యుమోనియా’ అధికంగా మనుషుల్లోనే..!

How Did Covid 19 Spread So Quickly

COVID-19 Spread : ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనావైరస్ మహమ్మారి ఇంత వేగంగా మనుషుల్లోకి ఎలా వ్యాపించింది? చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ అంతుపట్టని వైరల్ న్యుమోనియా కొవిడ్-19 మహమ్మారిగా ఎలా రూపుదాల్చింది అనేదానిపై రీసెర్చర్లు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. 2019 చివరి రోజులలో, వుహాన్ నగరంలో వ్యాపించి అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపించింది. ఆ తర్వాత వరుస వేరియంట్లు, మ్యుటేషన్లతో ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. వుహాన్ పుట్టిన ఈ వైరస్ వ్యాపిస్తోందంటూ పలు నివేదికలు వచ్చాయి. సరిగ్గా 75 రోజుల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా మహమ్మారిగా ప్రకటించింది. ఇప్పుడు దీనిని COVID-19 లేదా కరోనావైరస్ అని పిలుస్తున్నారు. అసలు కరోనా ఎలా పుట్టింది? ఎక్కడ పుట్టింది.. దీని మూలం ఏంటి అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే.

మనుషుల్లోకి ఎలా సంక్రమించిందో అంతుపట్టలేదు. ఈ కొత్త కరోనా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం కేసులు నమోదయ్యాయి. దీనికి చైనా కుట్రనే కారణం కావచ్చునని జోరుగా ప్రచారం జరిగింది. చైనాలోని ల్యాబరేటరీ నుంచి లీకైందంటూ అప్పట్లో పుకార్లు గుప్పుమన్నాయి. అధికారిక పరిశోధనల అనంతరం పుకార్లకు చెక్ పడింది. గబ్బిలాల ద్వారానే వైరస్ వ్యాపించి ఉంటుందంటూ అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. కరోనావైరస్ మూలాలు గబ్బిలాలనే వాదన ఉన్నప్పటికీ, రెండు ఆస్ట్రేలియా యూనివర్శిటీలకు చెందిన పరిశోధకులు మాత్రం.. మహమ్మారి వైరస్ SARS-CoV-2 ఇతర జాతుల కంటే మానవులకు వేగంగా సంక్రమించగలదని కనుగొన్నారు.

మానవుల్లో కరోనా సంక్రమణ వేగంగా ఉందని అధ్యయన  రచయిత డేవిడ్ వింక్లెర్ అన్నారు. COVID-19ను ఇప్పటివరకు ఎక్కువగా గబ్బిలాల్లో నుంచి జంతు మూలంగా అభివర్ణించారు. ఇది గబ్బిలాలకు సోకుతుందని, వందలాది కరోనావైరస్‌ల జన్యు సంక్రమణతో పోలి ఉందని అంటూ వచ్చారు. SARS-CoV-2తో ఉన్న ఒకటే ఒక తేడా.. ‘స్పైక్’ ప్రోటీన్.. వైరస్ ఒక నిర్దిష్ట ప్రోటీన్.. ACE2 ప్రోటీన్‌తో హోస్ట్ జంతువు కణాలలోకి ప్రవేశిస్తుంది. ఈ స్పైక్ ప్రోటీన్ ద్వారానే పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

గబ్బిలాలు, పాంగోలిన్లు మానవులతో సహా 13 జాతుల జన్యుసంబంధమైన డేటాను తీసుకున్నారు. పిల్లులు, కుక్కలు, పందులు, గుర్రాలు వంటి జంతువుల నమూనాలను సేకరించిన ఈ బృందం.. ప్రతి జాతి ACE2 ప్రోటీన్ రిసెప్టర్ అధునాతన కంప్యూటర్ నమూనాలను అభివృద్ధి చేసింది. SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్ ఎంత వేగంగా వ్యాపించగలదో తెలుసుకునేందుకు ఈ మోడళ్లను ఉపయోగించారు. కంప్యూటర్ మోడలింగ్ మానవ కణాలను బంధించే సామర్థ్యంతో పోలిస్తే.. ACE2 ప్రోటీన్ గబ్బిలాలతో సోకే వైరస్ సామర్థ్యం తక్కువగా ఉందని కనుగొన్నారు. వైరస్ గబ్బిలాల నుంచి మానవులకు నేరుగా వ్యాప్తి చెందదని అంటున్నారు. పాంగోలిన్లపై అధ్యయనంలో ఇతర మానవేతర జాతుల కంటే SARS-CoV-2 కు ఎక్కువ అవకాశం ఉందని భావించారు. కానీ, ఆ తర్వాత అది కాదని అభిప్రాయానికి వచ్చారు.