Microplastics : మైక్రోప్లాస్టిక్‌లు పిల్లల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే ?

ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ వాటి కంటే గాజు సీసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలకు ఆడుకోవడానికి ప్లాస్టిక్ బొమ్మలు ఇవ్వకపోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రసాయనాలు రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. పర్యావరణంలో విష రసాయనాలు. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌తో కూడిన ఆహార ఉత్పత్తులను పిల్లలకు ఇవ్వకపోవటమే మంచిది.

Microplastics : మైక్రోప్లాస్టిక్‌లు పిల్లల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే ?

microplastics

Microplastics : మైక్రోప్లాస్టిక్స్, 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే చిన్న చిన్న ప్లాస్టిక్ శకలాలు పర్యావరణం,పరిసరాలకే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ముప్పుగా మారుతున్నాయి. ప్లాస్టిక్ సీసాలు, టిఫిన్లు, కంటైనర్లు, చిప్స్ ప్యాకెట్లు, సింగిల్ యూజ్ స్ట్రాస్ నుండి ఉత్పన్నమయ్యే మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ కణాలు సముద్రాలు, నదులు, నేల మరియు మనం పీల్చే గాలిలో కూడా కనిపిస్తాయి.

READ ALSO : Zumba Dancing : 30 ఏళ్ల తర్వాత బరువు తగ్గడానికి జుంబా డ్యాన్స్ మంచిదా?

చిన్నపిల్లలు మైక్రోప్లాస్టిక్‌లను తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రోజువారీ ఉపయోగించే వస్తువులను తరచుగా నోటిలో పెట్టుకుంటుంటారు. మైక్రోప్లాస్టిక్స్ వల్ల జీర్ణ సమస్యలు, వాపు , పోషకాల శోషణకు అంతరాయం కలిగిస్తాయి. పిల్లలలో పెరుగుదల ఆలస్యానికి ఇవి కారణం కావచ్చు. మైక్రోప్లాస్టిక్‌లకు గురికాకుండా నిరోధించడం, ప్లాస్టిక్ ప్యాకేజింగ్, సీసాలు, లంచ్‌బాక్స్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.

READ ALSO : Gallbladder : పిత్తాశయం పేగు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ?

మైక్రోప్లాస్టిక్స్ పిల్లలలో అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ఈ రసాయనాలు పునరుత్పత్తి ఊబకాయం, అవయవ సమస్యలు పిల్లలలో అభివృద్ధి ఆలస్యం వంటి వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటాయి. ఊబకాయం అన్ని వ్యాధులకు కారణం. ఊబకాయం శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది. తినడం, త్రాగడం, శ్వాస తీసుకోవడం ద్వారా మైక్రోప్లాస్టిక్‌లను తీసుకుంటున్నారన్న విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. వివిధ అధ్యయనాల ప్రకారం ఈ రసాయనాలు పిల్లల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. అందువల్ల, తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Benefits Of Oral Hygiene : అన్ని వయసుల వారిలో నోటి పరిశుభ్రత వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా ?

ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ వాటి కంటే గాజు సీసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలకు ఆడుకోవడానికి ప్లాస్టిక్ బొమ్మలు ఇవ్వకపోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రసాయనాలు రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. పర్యావరణంలో విష రసాయనాలు. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌తో కూడిన ఆహార ఉత్పత్తులను పిల్లలకు ఇవ్వకపోవటమే మంచిది. బిడ్డకు ఆహారం ఇవ్వడానికి ప్లాస్టిక్ వాటికి బదులుగా గాజు పాల సీసాలు ఎంచుకోవాలి. ప్లాస్టిక్ బొమ్మలు , వస్తువులను పిల్లలకు ఇవ్వకండి. వాటిని నోటిలో పెట్టుకునే ప్రమాదం ఉన్నందున వాటికి బదులుగా చెక్క వస్తువులను అందజేయాలి.