Urinary Tract Infections : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మహిళల్లో జీవన నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తుందంటే?

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల కారణంగా నిద్రించడం చాలా కష్టమవుతుంది. మూత్ర విసర్జన చేయలన్న ఫీలింగ్, బర్నింగ్ మొదలైనవి మెదడుకు అత్యంత హానికరంగా మారతాయి. కాబట్టి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల సమయంలో అసౌకర్యంగా ఉంటుంది

Urinary Tract Infections : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మహిళల్లో జీవన నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తుందంటే?

Urinary Tract Infections : మహిళలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితి సర్వసాధారణం. ప్రసవ వయస్సులో ఉన్న మహిళల్లో మూత్ర మార్గ అంటువ్యాధులతో బాధపడేవారు అధికంగా ఉంటారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ చికిత్సకు సంబంధించి 3-రోజుల చికిత్స, యాంటీబయాటిక్స్‌తో 7 లేదా 10రోజుల చికిత్సతో ప్రభావవంతంగా తగ్గించవచ్చు. అయినప్పటికీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లు ముఖ్యంగా మహిళల జీవన నాణ్యతపై ప్రభావాన్ని చూపుతున్నట్లు కొన్ని సర్వేల్లో తేలింది.

UTI అనేది చికిత్స చేయగలగిన వ్యాధి. అయినప్పటికీ ఒక వ్యక్తి యొక్క రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే లక్షణాలను కలిగిఉంటుంది. దీని కారణంగా చాలా మంది మహిళలు ఆందోళన, నిరాశ మరియు కోపంతో సహా ప్రతికూల భావోద్వేగాలను అనుభవిస్తున్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు. హెల్త్‌కేర్ కంపెనీలైన సెర్నర్ ఎన్విజా మరియు జిఎస్కె పరిశోధకుల నుండి ఒక కొత్త అధ్యయనం UTI లతో బాధపడుతున్న మహిళల్లో సగానికి పైగా నిద్ర, వ్యాయామం మరియు లైంగిక సాన్నిహిత్యం క్షీణిస్తున్నట్లు కనుగొంది. పదేపదే ఎదురవుతున్న యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు ఆరోగ్య సంబంధిత జీవన నాణ్యతలో క్షీణతకు కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?

బాక్టీరియా ఎక్కువ శాతం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లులకు కారణమవుతుంది. సాధారణ పరిస్థితులలో, మూత్రనాళంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. అయితే, కొన్నిసార్లు బ్యాక్టీరియా మూత్రాశయం వరకు ప్రయాణిస్తుంది, ఫలితంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు యొక్క లక్షణాలు: మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంట, మూత్ర విసర్జన చేయాలనే కోరిక, జ్వరం, వికారం, వాంతులు, అలసట, వణుకు లేదా చలి వంటి లక్షణాలు ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏ స్త్రీకైనా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇతరుల కంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లను కలిగి ఉండే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు మరియు జీవన నాణ్యత :

ఈ అధ్యయనం కోసం, పరిశోధకులు యునైటెడ్ స్టేట్స్ నుండి 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు గల 375 మంది మహిళలపై ఆన్‌లైన్ సర్వేను నిర్వహించారు. వారంతా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారే. వారి విశ్లేషణలో, 66.9% మంది లైంగిక సంపర్కం బలహీనంగా ఉందని, 60.8% నిద్ర సరిగా పట్టకపోవటం, 52.3% మంది వ్యాయామం చేసే సామర్థ్యం బలహీనంగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అధికంగా వైద్య ఖర్చులు చేసినట్లు గుర్తించారు.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల కారణంగా నిద్రించడం చాలా కష్టమవుతుంది. మూత్ర విసర్జన చేయలన్న ఫీలింగ్, బర్నింగ్ మొదలైనవి మెదడుకు అత్యంత హానికరంగా మారతాయి. కాబట్టి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల సమయంలో అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో ఏమి ఆలోచించలేరు. ఏపనిని చేయలేరని సర్వేలో తేల్చారు. కొందరు మహిళలలో వారి జన్యు పరమైన లోపాల కారణంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల లు ఏర్పడుతుంటాయి. మూత్ర విసర్జన నాళం యొక్క రూపంను బట్టి ఇతర మహిళల కన్నా త్వరగా ఇన్ఫెక్షన్ కు గురవుతారు. ఇక డయాబెటీస్ ఉన్న మహిళలలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి వారికి కూడా ఈ ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ;

మహిళలకు సంబంధించిన శుభ్రతకు వినియోగించే స్ప్రేలు, సువాసన ఇచ్చే డచస్ మరియు బాత్రూం ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది. మూత్ర విసర్జన చేసే సమయంలో మూత్రాన్ని పూర్తిగా విసర్జించే ప్రయత్నం చేయాలి. త్వరగా ముగించాలనే ప్రయత్నంలో మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయకుండా కొద్ది మోతాదులో మిగల్చటం వంటివి చేయరాదు. లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత బాక్టీరియా శరీరంలోనికి వెళ్లకుండా మూత్ర విసర్జన అనంతరం శుభ్రం చేసుకోవాలి. కండోమ్ లు లేదా ఇతరత్రా గర్భ నిరోధక సాధనాలను వినియోగించటం మంచిది. పొడిగా ఉండే కాటన్ లోదుస్తులను ధరించాలి. ఈ జాగ్రత్తలు పాటించటం వల్ల ఇన్ ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.