Self Defense : ఆడపిల్లల ఆత్మరక్షణ ఎలాగంటే?…

ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలకు ఎవరో ఒకరు తోడు వెళ్ళటం చూస్తుంటాం.. ఇలా చేయటం వల్ల వారిలో భయం అలాగే ఉండే పోయే అవకాశం ఉంటుంది.

Self Defense : ఆడపిల్లల ఆత్మరక్షణ ఎలాగంటే?…

Girl's Self Defense (1)

Self Defense : పుడితే కొడుకే పుట్టాలని కోరుకునే రోజులు మారిపోయాయి. ప్రస్తుతం ఆడపిల్లలు పుట్టాలని ఆశపడుతున్న కాలం ప్రస్తుతం నడుస్తుంది. మహిళలు ఇల్లు, పిల్లలు, సంసారం, అనేరోజులు మారిపోయి అతివలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ సత్తా ఏంటో చాటుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అవకాశాలు సైతం వారిని వెతుక్కుంటూ తలుపుతడుతున్నాయి.

ఒకప్పటి ఆడపిల్ల చీకటి జీవితం ప్రస్తుతం వెలుగులు వెదజల్లుతుంది. అయినప్పటికీ నేటికీ మహిళల పట్ల వివక్షత కొనసాగుతుంది. ఆడపిల్లను విలాస వస్తువుగా బావిస్తూ సమాజంలో అనేక మంది శారీరక, మానసిక వేధింపులకు, చిత్రహింసలకు గురిచేస్తూ హింసాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆడపిల్లల తల్లిదండ్రులు చిన్ననాటి నుండే ఆడపిల్లల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలి. ఏదశలో ఎలాంటి పరిస్ధితులు ఎదురైనా ఎదుర్కోనేందుకు వీలుగా ఆత్మరక్షణ పద్ధతులపై వారిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

ఆడపిల్లల ఆత్మరక్షణ కోసం;…

కరాటే, కర్రసాము ; సమాజంలో రోజురోజుకు జరుగుతున్న అఘాయిత్యాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు కరాటే, కర్రసాము అనేవి ఆడపిల్లలకు ఒక ఆత్మరక్షణగా ఉపయోగపడతాయి. తల్లిదండ్రులు తప్పనిసరిగా చిన్ననాటి నుండే కరాటే, కర్రసాములో శిక్షణ ఇప్పించటం అవసరం. అత్యవసర సమయాల్లో వారికి ఇదొక అయుధంగా ఉపకరిస్తాయి. ఇతరులనుండి తమనితాము కాపాడుకునేందుకు దోహదపడతాయి.

డ్రైవింగ్ ; బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ వంటివి ఆడపిల్లలకు ఎందుకన్న ఆలోచనను విరమించుకోండి. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ ఆడపిల్లలకు ఈ రెండింటిని నేర్పించండి. ట్రాఫిక్ ను అధిగమించి వాహనాన్ని ఎలా పరుగులు పెట్టించాలో నేర్పిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అదిగించవచ్చో వారికి అర్ధమౌతుంది. ఇటీవలి కాలంలో ఆడపిల్లలు పైలెట్లుగా, డ్రైవర్లుగా వారి ప్రతిభను చాటుకుంటున్నారు.

రక్షణ కోసం ; అత్యవసర సమయాల్లో రక్షణ కోసం అవసరమైన ఫోన్ నంబర్లను తప్పనిసరిగా ఆడపిల్లలు తమ వద్ద ఉంచుకోవాలి. తమతమ గమ్యస్ధానాలను చేరుకునే క్రమంలో ఆటో, బస్సు, క్యాబ్ ఇలా వేటిలో ప్రయాణించిన ముందుగా వాటి యెుక్క నెంబర్లను నమోదు చేసుకోవటం వంటివి చేయాలి. అవసరనాకి అనుగుణంగా తమ స్నేహితులకో , కుటుంబసభ్యులకో షేర్ చేయటం వంటివి చేయటం ద్వారా అనుకుని పరిస్ధితి ఎదురనసందర్భంలో ఈ సమాచారం దోహదపడే అవకాశం ఉంటుంది.

భయంలేకుండా ; ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలకు ఎవరో ఒకరు తోడు వెళ్ళటం చూస్తుంటాం.. ఇలా చేయటం వల్ల వారిలో భయం అలాగే ఉండే పోయే అవకాశం ఉంటుంది. తల్లి దండ్రులు ఆడపిల్లలను ఒంటరిగా ఏపనికైనా బయటకు వెళ్లి వచ్చే విధంగా అలవాటు చేయాలి. అలాగే బంధువుల ఊర్లకు , ఇతర కాలేజి అవసరాల నిమిత్తం వారంతటవారే వెళ్ళే విధంగా ప్రోత్సహించాలి. అలా వెళ్ళిన సందర్భంలో ఎదురయ్యే పరిస్ధితులను, అవరోధాలను ఎలా ఎదుర్కోవాలో వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యతను తల్లి దండ్రులు తీసుకోవాలి.

సున్నితత్వాన్ని నేర్పొద్దు ; ఆడపిల్లల్ని సున్నితంగా పెంచటం ఏమంత మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉండాలో, మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉండకూడదో వారికి తెలియజెప్పండి. ప్రతివిషయానికి భయపడటం, బాధపడటం వంటివి లేకుండా ఎదుటి వ్యక్తులు బెదిరింపులకు దిగటమో, భయపెట్టటమో చేస్తే అలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పాలి, వారి పట్ల ఎంత కఠినంగా వ్యవహరించాలో నేర్పించటండి. ఇలా చేయటం వల్ల వారిలో ఆత్మస్థైర్యం రెట్టింపవుతుంది. ఇలా అమ్మాయిలను అన్ని విధాలుగా ప్రోత్సహించటం వల్ల సమాజంలో వారి జీవితం సాఫీగా సాగే అవకాశాలు ఉంటాయి. మానసికంగా, శారీరకంగా వారిని అన్ని విధాలుగా పఠిష్టంగా తీర్చిదిద్దటం అన్నది ప్రస్తుతం చాలా అవసరం.