మీ Phone నెంబర్ ఎవరైనా Block చేస్తే ఇలా తెలుసుకోండి!

  • Published By: sreehari ,Published On : January 11, 2020 / 11:32 AM IST
మీ Phone నెంబర్ ఎవరైనా Block చేస్తే ఇలా తెలుసుకోండి!

మీరు స్నేహితుడి ఆండ్రాయిడ్ ఫోన్‌కు మెసేజ్ లేదా కాల్ చేస్తే వెళ్లడం లేదా? ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేసినా రీచ్ అవడం లేదా? మెసేజ్ రీచ్ అయినట్టుగా కూడా ఎలాంటి డెలివరీ మెసేజ్ నోటిఫికేషన్ రావడం లేదా? అయితే మీ ఫోన్ నెంబర్ బ్లాక్ అయిందేమో చెక్ చేసుకోండి. మీరు ఎవరికి ఫోన్ కాల్, మెసేజ్ పంపుతున్నారో వారు మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు. అందుకే మీ ఫోన్ కాల్, మెసేజ్ వెళ్లడం లేదు. మెసేజ్, ఫోన్ కాల్ వెళ్లకపోవడానికి టెక్నికల్ గా చాలా రీజన్స్ ఉంటాయి. ఫోన్ కాల్, మెసేజ్ వెళ్లడం లేదంటే సిగ్నల్ లేకపోవచ్చు. మెసేజ్ వెళ్లడం లేదంటే.. మెసేజ్ సెంటర్ ఏదైనా మార్పులు చేసి ఉండొచ్చు. అందరికి ఇది డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది. 

ఏదైనా మార్పులు చేస్తే తప్ప ఇలాంటి సమస్య తలెత్తదు. ఇలాంటివి ఏమి లేకుండానే కాల్, మెసేజ్ రీచ్ కాకపోవడానికి ప్రధాన కారణం.. అవతలి వ్యక్తి తన ఫోన్లో మీ నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టి ఉండొచ్చు. అయితే, మీ స్నేహితుడు మీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేసినట్టు ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తున్నారా? ఒకవేళ బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవాలంటే నేరుగా వారినే అడిగితే తెలుసుకోవచ్చు. అలా సాధ్యం కాని పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈజీగా మెథడ్ ఒకటి ఉంది. మీ నెంబర్ ఎవరూ బ్లాక్ చేశారో లేదో ఈజీగా తెలిసిపోతుంది. ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.. 

1. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ లో Contacts app ఓపెన్ చేయండి.
2. ఎవరూ మీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేశారని డౌట్ ఉందో ఆ కాంటాక్ట్ పై Tap చేయండి.
3. మీ ఫోన్ స్ర్కీన్ టాప్ రైట్ కార్నర్ లో వర్టికల్ డాట్స్ Tap చేయండి.
4. Delete అనే ఆప్షన్‌పై Tap చేసి వారి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ Delete చేయండి.
5. మీ ఫోన్లో Contacts App మరోసారి ఓపెన్ చేయండి.
6. మీ ఫోన్ Top స్ర్కీన్ పై Search Bar పై Tap చేసి డిలీట్ చేసిన కాంటాక్ట్ నేమ్ సెర్చ్ చేయండి.
7. ఈ సెర్చ్ బార్ లో మీ స్నేహితుడి పేరు Suggested కాంటాక్టులో కనిపిస్తే అతడు బ్లాక్ చేయలేదని అర్థం
8. ఒకవేళ సెర్చ్ లో అతడి కాంటాక్ట్ నేమ్ కనిపించలేదంటే మీ ఫోన్ నెంబర్ బ్లాక్ అయినట్టే. 
9. మీరు డిలీట్ చేసిన స్నేహితుడి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తిరిగి ఎంటర్ చేయడం మర్చిపోకండి. 
10. ఆండ్రాయిడ్ ఫోన్లో మీ ఫోన్ నెంబర్ ఇతరులు బ్లాక్ చేసినట్టు ఇలా తెలుసుకోవచ్చు.