ఇదిగో ప్రాసెస్ : మీ PAN కార్డు.. SBI ఖాతాతో లింక్ చేశారా?

  • Published By: sreehari ,Published On : January 15, 2020 / 04:20 PM IST
ఇదిగో ప్రాసెస్ : మీ PAN కార్డు.. SBI ఖాతాతో లింక్ చేశారా?

ఏదైనా బ్యాంకులో ఖాతా తెరవాలన్నా ఆధార్ కార్డు నెంబర్ సహా పాన్ కార్డు ఎంతో ముఖ్యం. ఈ రెండు డాక్యుమెంట్లు లేకుండా ఎలాంటి సర్వీసులను కూడా పొందలేరు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్ డ్ డిపాజిట్, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు, లోన్లు, ఇన్ కమ్ ట్యాక్సు రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఆధార్, పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. సాధారణంగా పాన్ కార్డులో 10 అంకెల అల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. 

ఇందులో సదరు కార్డుదారుడి పేరు, పుట్టిన తేదీ, వయస్సు అన్ని వివరాలు ఉంటాయి. ఆదాయ పన్ను శాఖ.. ఈ లామినేటెడ్ కార్డును జారీ చేస్తుంది. మరోవైపు 12 అంకెల బయోమెట్రిక్ ఆధార్ నెంబర్ ను UIDAI జారీ చేస్తుంది. ఈ కార్డు పొందాలంటే.. వ్యక్తిగత బయోమెట్రిక్ వివరాలు.. ఐరీస్ స్కాన్, ఫింగర్ ఫ్రింట్స్, డెమోగ్రాఫిక్ సమాచారమైన పుట్టినతేదీ, నివాస చిరునామా వంటి వివరాలను పొందుపరుస్తారు. 

ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం.. రూ.50వేలు లేదా అంతకంటే లావాదేవీలు చేస్తే పాన్ కార్డు తప్పనిసరి. మీ UIDతో మీ బ్యాంకు అకౌంట్ లింక్ చేసుకోవడం తప్పనిసరి కానప్పటికీ.. KYC (నో యూవర్ కస్టమర్) నిబంధనల కింద ఆధార్ కార్డును ఒక గుర్తింపు కార్డుగా పరిగణించడం జరుగుతోంది. 

మీరు ఎస్బీఐ ఖాతాదారులు అయిత వెంటనే మీ పాన్ కార్డుతో అనుసంధానం చేసుకోండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్ (onlinesbi.com) ద్వారా మీ పాన్ కార్డును లింక్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకించి మీ బ్యాంకు బ్రాంచ్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. ఆన్ లైన్ ద్వారా పాన్ కార్డును ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ తో లింక్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.. 

* మీరు SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో రిజిస్ట్రర్ అయి ఉండాలి.
* ATM కార్డు యాక్టివ్ అయి ఉండాలి.
* మీ బ్యాంకు అకౌంట్ తో మొబైల్ నెంబర్ నమోదు తప్పక ఉండాలి.
* SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్ విజిట్ చేయండి.
* మీ అకౌంట్లో Log on అవ్వండి.
* Profile-PAN రిజిస్ట్రేషన్ కింద My Accounts క్లిక్ చేయండి.
* మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ సెలక్ట్ చేయండి.
* మీ PAN నెంబర్ ఫీడ్ అయ్యాక Submitపై క్లిక్ చేయండి.
* మీ రిక్వెస్ట్ సంబంధిత బ్రాంచ్ కు వెళ్తుంది. 
* 7 రోజుల్లో మీ రిక్వెస్ట్ ను బ్రాంచ్ ప్రాసెస్ చేస్తుంది.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు PAN మ్యాపింగ్ అయినట్టు మెసేజ్ వస్తుంది.

SBI బ్రాంచ్ ద్వారా PAN-Linking చేయండిలా :
* మీ దగ్గరలోని SBI బ్రాంచ్ విజిట్ చేయండి.
* మీ PAN కార్డు ఒక కాపీని వెంట తీసుకెళ్లండి.
* రిక్వెస్ట్ లెటర్ PAN వివరాలు ఎంటర్ చేయండి.
* పాన్ కార్డు జిరాక్స్ కాపీని సబ్మిట్ చేయండి.
* బ్రాంచ్ అధికారులు వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తారు.
* వెరిఫికేషన్ అయ్యాక మీ మొబైల్ కు SMS వస్తుంది.
* బ్యాంకు అకౌంటుతో PAN లింక్ అయినట్టుగా స్టేటస్ వస్తుంది.