కరోనా వ్యాక్సిన్ ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుందంటే?

కరోనా వ్యాక్సిన్ ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుందంటే?

How long does COVID-19 vaccine immunity last : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనావైరస్ ను నిర్మూలించే కరోనా వ్యాక్సిన్లు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది. పూర్తిగా ప్రజలందరికి అందబాటులోకి రావడానికి కొంతకాలం పట్టే అవకాశం ఉంది. 2021 కొత్త ఏడాదిలో ఈ కరోనా వ్యాక్సిన్లను బిలియన్ల మందికి టీకాలు వేయడమనేది భారీ సవాలుతో కూడుకున్ వ్యవహారమని చెప్పవచ్చు. ప్రపంచమంతా కరోనా నిర్మూలన కోసం టీకాలను అందించేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ కరోనా వ్యాక్సిన్లు ఎంత మొత్తంలో సమర్థవంతంగా పనిచేయగలవు అనేది కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. మీజిల్స్‌కు వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి జీవితకాలం ఉంటుంది. అందుకే ఈ టీకాలను ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి.

స్టమక్ ఫ్లూకు కారణమయ్యే నోరోవైరస్ (norovirus)కు రోగనిరోధక శక్తి కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుంది. వ్యాధి నుంచి ప్రజలను రక్షించాలంటే తరచూ టీకాలు వేయడం అవసరమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్లలో రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందంటే.. కరోనావైరస్ వ్యాక్సిన్లు కొన్ని నెలలు మాత్రమే వినియోగంలో ఉంటాయి. అంటే ఎక్కువకాలం పాటు స్టోర్ చేయలేని పరిస్థితి. అందుకే ఈ వ్యాక్సిన్లలో రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని అంటున్నారు. బహుశా మన జీవితాంతం ఒకే టీకా మాత్రమే అవసరం పడొచ్చు. కాలానుగుణ ఫ్లూకు వ్యతిరేకంగా ప్రతి ఏడాది వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే.. ప్రతి రెండు ఏళ్లకు సాధారణ షాట్లు అవసరం పడొచ్చునని అంచనా వేస్తున్నారు.

మహమ్మారి ప్రారంభంలో అనేక అధ్యయనాలు SARS-CoV-2కు యాంటీబాడీస్ మొదటి కొన్ని నెలల తరువాత క్షీణిస్తాయని గుర్తించారు. టీకా రోగనిరోధక శక్తి కారణంగా ప్రజలు కూడా తమ సహజ రోగనిరోధక శక్తిని త్వరగా కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు 2020 డిసెంబరులో ప్రచురించిన పరిశోధనలో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల్లో కనీసం 8 నెలల వరకు ఇమ్యూనిటీని పెంచే యాంటీబాడీలు ఉంటాయని ఇప్పటికే అధ్యయనాల్లో తేలింది.

డిసెంబరులో ఇంగ్లాండ్‌లో 12,000 మందికి పైగా హెల్త్ వర్కర్లు పాల్గొన్న మరో అధ్యయనంలో SARS-CoV-2 బారిన పడిన వారిలో యాంటీబాడీలను ఉత్పత్తి అవుతున్నాయని తేలింది. అదే అధ్యయనం ప్రకారం.. 1,400 కంటే ఎక్కువ యాంటీబాడీ-పాజిటివ్ కలిగిన వ్యక్తుల్లో కేవలం ముగ్గురు వ్యక్తులు 2020లో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మరోసారి కరోనా బారినపడ్డారు. చాలా వైరసులు సోకినప్పుడు.. రోగనిరోధక ప్రతిస్పందనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఒక టీకా కరోనావైరస్‌ను ప్రభావంతంగా మాత్రమే కాకుండా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని అందించే అవకాశం ఉంది.