Vitamin D : విటమిన్ డి కోసం ఎండలో ఎంత సేపు ఉండాలంటే?..

ఎండలో ఎంత సేపు ఉండాలన్నదానిపై నిర్ణీత సమయమంటూ లేదు. సూర్యరశ్మి మోతాదు శరీరంపై ఎక్కవగా పడ్డా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఎండ తగినంత ఉంటే శరీరం తనకు అవసరమైన డి విటమిన్ ను గ్రహ

Vitamin D : విటమిన్ డి కోసం ఎండలో ఎంత సేపు ఉండాలంటే?..

Vitamin D

Vitamin D : ప్రజల జీవితాలు అనేక మార్పులకు లోనవుతున్నాయి. నీడపటున ఉంటూ, ఏసిలలో పనిచేసే ఉద్యోగాలు కావటంతో శరీరానికి ఎండ ఏమాత్రం తగలటం లేదు. దీంతో విటమిన్ డి లోపానిగి గురవుతున్నారు. ముఖ్యంగా కరోనా నేపధ్యంలో పట్టణాల్లో మరణాల శాతం అధికంగా ఉండటానికి ప్రధాన కారణం డి విటమిన్ లోపమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎండలో కాయకష్టం చేసే గ్రామీణ వాతావరణంలో ఉండే వారిలో విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్లే కరోనా వంటి వ్యాధుల నుండి వారు సునాయాసంగా బయటపడగలుగుతున్నారు.

శరీరంలోని ఎముకలకే కాకుండా, శరీర రోగ నిరోధక వ్యవస్థకు కూడా సూర్యరశ్మి చాలా అవసరం. ఎండ వల్ల శరీరంలో ఉత్తేజాన్ని పెంచే సెరోటోనిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎంతసేపు సూర్మరశ్మిలో ఉంటామన్న దాని మీదే మన శరీరంలోని విటమిన్-డి ఆధారపడి ఉంటుందట.

ఎండలో ఎంత సేపు ఉండాలన్నదానిపై నిర్ణీత సమయమంటూ లేదు. సూర్యరశ్మి మోతాదు శరీరంపై ఎక్కవగా పడ్డా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఎండ తగినంత ఉంటే శరీరం తనకు అవసరమైన డి విటమిన్ ను గ్రహించుకుంటుంది. పులచని చర్మం కలిగిన వారు ఎండలో ప్రతి రోజూ 15 నుండి 20 నిమిషాలు ఉంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. చర్మం యొక్క తీరును బట్టి కూడా ఎండలో ఎంత సేపు ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది.

ఎండలో నిలబడటం వల్ల సూర్యరశ్మిలో ఉండే విటమిన్‌ డి మన చర్మం ద్వారా శరీరంలోకి, రక్తంలోకి చేరుతుంది. ఈ విటమిన్‌డి మన రక్తంలోకి క్యాల్షియం, ఫాస్ఫరస్‌ ఖనిజాలను ఎక్కువగా చేరేటట్లు దోహదపడుతుంది. దానివల్ల ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. వాటి పనితీరు మెరుగ్గా ఉంటుంది. విటమిన్‌ డి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

విటమిన్ డి లోపం ఏర్పడితే ఆకలి అంతగా లేకపోవటం , బరువు తగ్గుదల, నిద్ర సరిగా పట్టక పోవటం, వంట్లో నీరసం, వంటి సమస్యలు తరచూ వేధించే అవకాశాలు వున్నాయి. వీటితోపాటు తీవ్రమైన అలసట, బలహీనత, ఎముకల్లో నొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచనా శక్తి తగ్గిపోవడం, తరచుగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు శరీర నిరోధక శక్తి తగ్గుతుంది. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది.

ఎండలో నిలబడలేమనుకునే వారు విటమిన్ డి కోసం కొన్ని రకాల ఆహార పదార్ధాలను తీసుకోవటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డు, పాలు, పెరుగు, ఆకుకూరలు, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే క్యాల్షియం, విటమిన్‌డి కలిగిన మాత్రలు వైద్యుల సలహామేరకు తీసుకోవటం ఉత్తమం.