Summer : వేసవిలో కాలంలో ఎన్ని లీటర్ల నీరు శరీరానికి అవసరమంటే?.

రోజుకు ఎంతనీటిని తాగాలన్న ధానిపై చాలా మందిలో అనేక అనుమానాలు ఉన్నాయి. నీటిని ఎక్కువగా ఒకేసారి తాగకుండా కొద్ది కొద్దిగా తాగటం మంచిది. అలాగే దాహం వేస్తున్న సమయంలో తాగాలి.

Summer : వేసవిలో కాలంలో ఎన్ని లీటర్ల నీరు శరీరానికి అవసరమంటే?.

Drinking Water

Summer : మనిషి బ్రతకటానికి మూలాధారమైన వాటిలో నీరు ముఖ్యమైనది. శరీరానికి తగినంత నీరు అందించాల్సిన అవసరం ఉంది. చాలా మంది శరీరానికి కావల్సినంత నీరు అందించకపోవటం వల్ల అనేక ఆరోగ్య ససమ్యలను కొని తెచ్చకుంటున్నారు. శరీరానికి తగినంత నీరు అందించాల్సిన అవసరం తప్పకుండా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీర అవయవాల పనితీరు మెరుగుపడాలంటే నీరు తాగటం చాలా అవసరం. శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుకునేందుకు నీరు తాగటం మంచిది.

అలాగని ఎక్కువ నీరు తాగడం కూడా చాలా ప్రమాదకరం. శరీరంలోని మూత్రపిండాలు ఒక రోజులో 20 నుండి 28 లీటర్ల నీళ్ళని ఫిల్టర్ చేయగలదు. ఒక గంటలో ఒక లీటర్ కన్న ఎక్కువ ఫిల్టర్ చేయలేవు. మన సెల్స్ లో సోడియం పొటాషియం ఎలెక్ట్రోలైట్స్ ఉంటాయి. ఈ ఎలెక్ట్రోలైట్స్ మనము తాగే నీళ్లలో కూడా ఉంటాయి. వీటిని మన మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తూ ఉంటాయి కానీ ఒక లిమిట్ వరకు మాత్రమే ఫిల్టర్ చేస్తాయి. నీరు ఎక్కువగా తాగినట్లైతే ఎలేక్ట్రోలైట్స్ కూడా ఎక్కువగా మన శరీరంలో చేరే అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు కూడా వీటిని ఫిల్టర్ చేయలేవు. అప్పుడు ఈ ఎలెక్ట్రోలైట్స్ మన సెల్స్ లో ప్రవేశించి సెల్స్ సైజు పెరుగుతుంది. దీంతో సెల్స్ వాపు కు గురి అవుతాయి.

రోజుకు ఎంతనీటిని తాగాలన్న ధానిపై చాలా మందిలో అనేక అనుమానాలు ఉన్నాయి. నీటిని ఎక్కువగా ఒకేసారి తాగకుండా కొద్ది కొద్దిగా తాగటం మంచిది. అలాగే దాహం వేస్తున్న సమయంలో తాగాలి. చెమట ఎక్కువగా పట్టిన సందర్భంలో నీటిని తాగటం మంచిది. దీని వల్ల హైడ్రేట్ గా ఉండవచ్చు. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ప్రకారం మహిళలు ప్రతిరోజూ 2.7 లీటర్లు. పురుషులు 3.7 లీటర్లు తాగాలని సూచిస్తున్నారు. రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగితే సరిపోతుందని,దాహం వేసినా, వేయకపోయినా.. గంట గంటకు నీళ్లు తాగాలని మరికొందరు నిపుణులు సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్ వుమన్స్, బ్రెస్ట్ ఫీడింగ్ వుమన్స్ అయితే.. కనీసం 3 లీటర్ల నీళ్లు తీసుకోవాలని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా నీటి పరిమాణం ఉండే ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే వేసవి సమయంలో చెమట ఎక్కవగా పడుతుంది. కాబట్టి రోజుకు 4లీటర్ల వరకు నీరు త్రాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.