Walking : రోజుకు ఎన్ని అడుగులు వేస్తే బరువు తగ్గొచ్చంటే?..

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే

Walking : రోజుకు ఎన్ని అడుగులు వేస్తే బరువు తగ్గొచ్చంటే?..

Processed With Vsco With Q7 Preset

Walking : నడక.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఇటీవల వైద్యులు పదేపదే చెప్తున్నారు. తమ వద్దకు వచ్చే పేషెంట్లకు ఇదే విషయాన్ని సూచిస్తున్నారు. అయితే రోజుకు ఎన్ని అడుగులు వేయాలి. ఎంత సేపు నడిస్తే మంచిదన్న దానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. అయితే అలాంటి సందేహాల నివృత్తి చేసుకునేందుకు ప్రస్తుతం సెల్ ఫోన్ లో అనేక యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్ లలోనే సమగ్రసమారం ఉంటుంది. నడకకు సంబంధించి బరువు, ఎత్తుకు సంబంధించిన వివరాలు యాప్ లో అందిస్తే రోజుకు ఎన్ని అడుగులు వేయాలి. ఎంత సేపు వాకింగ్ చేస్తే ఎన్ని క్యాలరీలను ఖర్చు చేయవచ్చు అన్న పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు అవి మనకు అందిస్తే టెక్నాలజీ ద్వారా తెలియపరుస్తాయి. ఈ డిజిటల్ పరికరాల రాకతో ప్రస్తుతం రోజుకు ఎన్ని అడుగులు వేశాం ? ఇంకా ఎన్ని అడుగులు వేయాలని ఇట్టే తెలుసుకోవచ్చు. రోజుకు 10వేల అడుగులు వేస్తే సంపూర్ణ అరోగ్యంతో ఉండవచ్చన్న బావన చాలా మందిలో ఉంది.

అయితే, ఇన్నే అడుగులు వేయాలి.. ఇంతకు మించి అడుగులు వేయడానికి వీల్లేదు అనే నిబంధనలేవీ లేవు. టెక్సాస్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం, చురుకైన వ్యక్తులు 5,000 అడుగులు లేదా అంతకంటే తక్కువ వేసిన్నప్పుడు వారిలో మరుసటి రోజు జీవక్రియలు సక్రమంగా జరుగడం లేదు. అందుకని రోజుకు 5,000 అడుగులకు తక్కువ కాకుండా వేయడం అత్యవసరం. గుండె వ్యాధులు, స్థూలకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు, డిప్రెషన్.. వంటి అనారోగ్యాలను నడక ద్వారా మనదరి చేరకుండా చూసుకోవచ్చు.

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే ఇత‌ర ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. రోజూ వ్యాయామం చేయడం, అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవడం పట్ల ఇటీవల చాలా మంది శ్రద్ధ చూపిస్తున్నారు. ఒక్కపైసా ఖర్చు పెట్టకుండా శరీరం బరువు తగ్గించుకోవడంలో నడక ఎంతగానో సహాయపడుతుంది. జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంటి వద్దనే ఎంచక్కా వాకింగ్‌ చేయొచ్చు.

నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు. అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌త పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చ‌ర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి. నిత్యం వాకింగ్ చేయడం వ‌ల్ల ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వ‌స్తార‌ట‌. వారు హ్యాపీగా ఉంటార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. నడక వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం 31 శాతం వరకు తగ్గుతుందని, సీవీడీ సమస్యలతో మరణాల ప్రమాదం 32 శాతం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.

కైల్‌ ఫ్లాక్‌ రచించిన మెడిసిన్‌ అండ్‌ సైన్స్‌ ఇన్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ అనే పరిశోధనాపత్రం 2020 లో ప్రచురితమైంది. వ్యాయామం చేయటం వల్ల కొంత శక్తి కోల్పోవాల్సి వస్తుంది. ఇది కొంత బరువుతగ్గటానికి దారితీస్తుంది. మూడు నెలలపాటు ఇలా చేయడం వల్ల శరీరం బరువు తగ్గడానికి దారితీస్తుంది అని కైల్‌ ఫ్లాక్‌ వెల్లడించారు. అడుగుల సంఖ్య పెరిగే కొద్ది ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉంటాయిని పేర్కొన్నారు. వాకింగ్ రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి.