Cholesterol : శరీరంలో కొలెస్ట్రాల్ అవసరత ఎంత? దాని మోతాదులు మించితే ఏమౌతుంది?

కొవ్వు, ప్రొటీన్‌లతో కూడిన పదార్థాలు అయిన లిపోప్రొటీన్‌ల ద్వారా కొలెస్ట్రాల్ శరీరంలో చేరుతుంది. కొలెస్ట్రాల్ ధమనుల లోపల ఇతర రసాయనాలతో కలిసి గట్టి, మందంగా మారుతుంది. కొలెస్ట్రాల్ ను ప్రధానంగా రెండు రకాలుగా చెప్తారు. ఒకటి మంచిది, రెండవ చెడ్డది.

Cholesterol : శరీరంలో కొలెస్ట్రాల్ అవసరత ఎంత? దాని మోతాదులు మించితే ఏమౌతుంది?

cholesterol is needed in the body

Cholesterol : మన శరీర కణాలన్నింటిలో కొలెస్ట్రాల్ వుంటుంది. శరీరానికి హార్మోన్లు, విటమిన్ డి, ఆహార జీర్ణక్రియలో సహాయపడే రసాయనాలను ఉత్పత్తి చేయడానికి కొలెస్ట్రాల్ అవసరం. కాలేయం కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికితోడు మాంసాహారం నుండి కొలెస్ట్రాల్‌ శరీరానికి అందుతుంది పొందుతాము. వీటితో పాటు వెన్న, చీజ్ వంటి పాల ఉత్పత్తులు తీసుకుంటే వాటి నుండి కొంత బాగం కొలెస్ట్రాల్ అందుతుంది. అయితే అన్ని కొవ్వులు చెడ్డవి కాదు. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండటం హానికరం. ఎందుకంటే వాటిలో చాలా సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. దీని ఫలితంగా ధమనులు ఇరుకైనవిగానూ, తక్కువ ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. రక్తం గడ్డకట్టడం పెరిగి, సంకోచించిన ధమనులలో సమస్య ఏర్పడితే గుండెపోటు, స్ట్రోక్ వంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కొవ్వు, ప్రొటీన్‌లతో కూడిన పదార్థాలు అయిన లిపోప్రొటీన్‌ల ద్వారా కొలెస్ట్రాల్ శరీరంలో చేరుతుంది. కొలెస్ట్రాల్ ధమనుల లోపల ఇతర రసాయనాలతో కలిసి గట్టి, మందంగా మారుతుంది. కొలెస్ట్రాల్ ను ప్రధానంగా రెండు రకాలుగా చెప్తారు. ఒకటి మంచిది, రెండవ చెడ్డది. చెడు కొలెస్ట్రాల్ దీనినే LDL అని అంటారు. ఈ కొలెస్ట్రాల్‌ను కాలేయం నుండి కణాలకు తీసుకువెళుతుంది. ఇక్కడ ఇది అనేక ప్రక్రియలలో ఉపయోగించబడుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ రక్తప్రవాహంలో అధిక స్థాయికి చేరితే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్ దీనినే HDL అంటారు. ఈ కొలెస్ట్రాల్‌ తిరిగి కాలేయానికి చేరుతుంది. అక్కడికి చేరుకున్న తర్వాత కొలెస్ట్రాల్ శరీరం నుండి తొలగించబడుతుంది. తద్వారా హృదయనాళ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.

కొలెస్ట్రాల్ మన శరీరంలో లైంగిక రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మన శరీర కణజాలాల నిర్మాణానికి, కాలేయంలో పిత్త జీర్ణక్రియకు దోహదపడుతుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయి 200 mg / dL కంటే తక్కువగా ఉండాలి. 200 మరియు 239 మధ్య, ఇది ప్రమాదానికి దగ్గరగా పరిగణించబడుతుంది. అంతకంటే అనగా 240 mg / dL కంటే ఎక్కువ స్థాయిలు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ట్రైగ్లిజరైడ్ మన రక్తంలో మరొక రకమైన కొవ్వు. కొలెస్ట్రాల్ మాదిరిగా, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా పరిమితిలోనే ఉండేలా చూసుకోవాలి. తక్కువ కొలెస్ట్రాల్ ఆహారాలను తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువు పెరగకుండా ఉండటం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచవచ్చు.