భారతదేశంలో కొవిడ్-19 ఎంత వేగంగా వ్యాపించగలదు? ప్రభుత్వం చెప్పిన గణాంకాలు!

  • Published By: sreehari ,Published On : March 24, 2020 / 11:15 AM IST
భారతదేశంలో కొవిడ్-19 ఎంత వేగంగా వ్యాపించగలదు? ప్రభుత్వం చెప్పిన గణాంకాలు!

భారతదేశంలో కరోనావైరస్ కేసులు ఎలా వేగంగా పెరుగుతాయనే దానిపై ప్రభుత్వ అంచనా వేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జర్నల్ నివేదికలో ” భారతదేశంలో కోవిడ్ -19 వ్యాప్తికి నియంత్రించవచ్చునని పేర్కొంది. కానీ ఆశావాద కోణంలో పరిశీలిస్తే.. ఢిల్లీలో 1.5 మిలియన్ల కరోనా బాధిత కేసులు, ముంబై, కోల్‌కతా బెంగళూరులలో సుమారు 5లక్షల కేసులు నమోదు కావొచ్చు. ఫిబ్రవరి నుంచి 200 రోజుల వ్యవధిలో ఈ కేసుల సంఖ్య గరిష్టంగా ఉంటుందని ఫిబ్రవరి 27 నాటి నివేదిక పేర్కొంది.

నిరాశావాద కోణంలో పరిశీలిస్తే.. కరోనా వైరస్ బాధిత కేసులు ఢిల్లీలో 10 మిలియన్లు, ముంబైలో 4 మిలియన్లు పెరుగుతాయని అంచనా. ఫిబ్రవరి నుండి కేవలం 50 రోజుల్లో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. కానీ ఊహాత్మక, ఆశావాద కోణంలో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఢిల్లీలో కేవలం 2లక్షల కేసులు – అది కూడా 700 రోజుల్లో. ఈ కోణంలో వైరస్ లక్షణాలను చూపించే వారిలో సగం మంది నిర్బంధంలో ఉంటారని, అది కూడా మూడు రోజుల్లోనే ఉంటుందని భావిస్తోంది. “ఇది ఒక నెల క్రితం చేసిన గణిత నమూనా అని మీరు గుర్తుంచుకోవాలి” అని ICMR డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ NDTV అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

నివేదికలో ఎక్కువ భాగం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా బెంగళూరులలోని విమానాశ్రయాలు భారతదేశపు ప్రధాన అంతర్జాతీయ ట్రావెల్ హబ్‌లు కావడంపై దృష్టి సారించాయి. వైరస్ ప్రారంభంలో ప్రయాణీకుల ద్వారా వ్యాపించింది. విమానాశ్రయంలో 15 లక్షల మందికి పైగా పరీక్షలు జరిపినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ నివేదిక ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ.. విమానాశ్రయాలలో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా సోకిన ప్రయాణికులలో 46 శాతం మంది గుర్తించినట్టు పేర్కొంది. మరొక అధ్యయనం అంచనా ప్రకారం.. ట్రావెల్ స్క్రీనింగ్ సోకిన ప్రయాణికులలో సగానికి పైగా వైరస్ లక్షణాలు లేవు.. బహిర్గతమైన వారి గురించి తెలియదు.

కరోనా ఇంక్యూబేషన్ పిరియడ్ బట్టి, వైరష్ లక్షణాలు లేనిది లేదా బహిర్గతం గురించి చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం మార్చి నెల ప్రారంభంలో విమానాశ్రయాలలో థర్మల్ స్క్రీనింగ్ ప్రారంభించింది, ఫిబ్రవరిలో కాదనే విషయం గుర్తించుకోవాలి. కాబట్టి ఈ ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలు వ్యాప్తికి కారణాలుగా విశ్లేషించబడినప్పటికీ, విమానాశ్రయాలలో వైరస్ లక్షణం లేని కేసులను గుర్తించడానికి వేగవంతమైన టెస్టు కిట్లు (అందుబాటులో లేవు)” అని నివేదిక పేర్కొంది.

ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్నందున వాటన్నింటినీ ప్రయోగశాలలలో పరీక్షించడం అసాధ్యమని కూడా పేర్కొంది. ఈ నివేదిక చైనా నుండి వచ్చిన ప్రయాణీకుల డేటాపై మాత్రమే రూపొందించడం జరిగింది. మిగతా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల నుండి కాదు. ఈ నివేదిక రూపొందిన తరువాత మరిన్ని కరోనా కేసులు బయటపడ్డాయి.

దేశీయ విమానాల నిషేధం ఈ నివేదిక నేపథ్యంలో వచ్చింది. ఇప్పటివరకు ధృవీకరించిన కేసుల్లో ఎక్కువ భాగం విమాన ప్రయాణికులు లేదా వారి నుండి అధికంగా ఒకరినుంచి మరొకరికి వ్యాపించిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇక మూడవ దశ, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ప్రారంభం కాలేదని ప్రభుత్వం వెల్లడించింది.

See Also | కరోనాపై యుద్ధం, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల భార్య రూ.2కోట్లు విరాళం