Delta Variant-Mask Wear : డెల్టా వేరియంట్ ప్రభావం ఉంటుందిలా.. ఇంతకీ మాస్క్ ధరించాలా? వద్దా?

డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ కొత్త డెల్టా వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డెల్టా వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? మాస్క్ ఎవరూ ధరించాలి?

Delta Variant-Mask Wear : డెల్టా వేరియంట్ ప్రభావం ఉంటుందిలా.. ఇంతకీ మాస్క్ ధరించాలా? వద్దా?

How The Delta Variant Affects Whether You Should Wear A Mask Or Not

Delta Variant-Maks Wear : డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ కొత్త డెల్టా వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డెల్టా వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? మాస్క్ ఎవరూ ధరించాలి? అనేదానిపై అమెరికా సహా, ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. డెల్ట్ వేరియంట్ విజృంభణ సమయంలో ప్రతిఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోనివారితో పాటు వేయించుకున్నవారు కూడా తప్పక మాస్క్ ధరించాలని చెబుతున్నారు. ప్రత్యేకించి ఇండోర్ పబ్లిక్ ప్రాంతాల్లో మాస్క్ లు ధరించమని జాగ్రత్తలు చెబుతున్నారు.

కరోనా వేరియంట్లలో డెల్టా వేరియంట్‌ ఒకటి.. భారతదేశంలో మొట్టమొదట ఈ వేరియంట్ ను గుర్తించారు. SARS-CoV-2 మునుపటి జాతుల కంటే చాలా ప్రాణాంతకమైది. వేగంగా వ్యాపింగలదు. టీకాలు వేసిన వ్యక్తుల్లో కూడా ఈ డెల్టా వేరియంట్ సోకే ప్రమాదం ఉంది. అందుకే ముందుజాగ్రత్తగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా గట్టిగా చెబుతోంది. మరోవైపు పూర్తిగా టీకాలు తీసుకున్న వారు మాస్క్‌లు లేకుండా సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించవచ్చని పేర్కొంది. డెల్టా వేరియంట్‌‌పై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవడానికి అందరూ మాస్క్ లు ధరించడం చాలా ముఖ్యమని అన్నారు. డెల్టా వేరియంట్‌తో కేసులు పెరిగిపోతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

టీకాలతో కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా తగిన రక్షణ కల్పిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి, అయితే టీకాలు తీసుకున్న వ్యక్తుల్లో వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కాకపోతే లక్షణాలు తక్కువగా ఉండొచ్చు.. టీకాలు వేసినా, వేసుకోకపోయినా.. కిరాణా దుకాణాలు, థియేటర్లు, కార్యాలయాలు, రెస్టారెంట్లలో ఇంటి లోపల మాస్క్ తప్పనిసరిగా ధరించాలని లాస్ ఏంజిల్స్ ఆరోగ్య అధికారులు సూచించారు.

డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి ఎంతవరకు పనిచేస్తుందనే ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఎల్‌ఎ కౌంటీ ఆరోగ్య అధికారి డాక్టర్ ముంటు డేవిస్ చెప్పారు. పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులు కూడా డెల్టా వేరియంట్‌ బారిన పడతారని అంటున్నారు. కరోనా రాకుండా టీకాలు 80శాతం ప్రభావవంతంగా ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వ్యాధి సోకిన వ్యక్తులతో డెల్టా వేరియంట్‌కు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టదని హెచ్చరిస్తున్నారు.