Blood Cells : తెల్ల రక్తకణాలు పెరగాలంటే ఇలా చేయండి?

గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. పాలకూర, బ్రకోలి, చిలకడ దుంపల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ లు రాకుండా నివారిస్తాయి.

Blood Cells : తెల్ల రక్తకణాలు పెరగాలంటే ఇలా చేయండి?

Blood Cells

Blood Cells : మనిషి శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడటానికి రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు రక్షణగా పనిచేస్తాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తిలో ఈ తెల్ల రక్త కణాలు పనిచేస్తాయి. ఇవి కూడా ఎర్ర రక్త కణాలు లాగానే ఎముక మద్య భాగంలో ఏర్పడతాయి. ఇవి నిరంతరం రక్త ప్రవాహంలో కలిసి రోగాల పై పోరాడతాయి. అటువంటి క్రమంలో కొన్ని సార్లు వీటి సంఖ్య తగ్గుతుంది. తెల్లరక్తకణాలు మన శరీరాన్ని రోగాలనుంచి కాపాడతాయి. రోగాల అంతు చూస్తాయి. తెల్లరక్తకణాల సంఖ్య పడిపోతే రోగాల దాడికి అడ్డుకోవడం కష్టం.

ఒక మైక్రోలీటర్ రక్తంలో 4500 నుంచి 10000 దాక తెల్లరక్తకణాలు ఉండాలి. తెల్ల రక్త కణాలు తగ్గడం వల్ల శరీరం క్రమంగా క్షీణిస్తుంది. అలసట, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు, బద్ధకం గా ఉండటం, తరచుగా వ్యాధుల బారిన పడటం వంటి లక్షణాలు కనపడతాయి. అయితే వీటికి కొన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటి ఆక్సిడెంట్ లు, తగు మోతాదులో మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వీటి సంఖ్యను పెంచుకోవచ్చు.

విటమిన్ బి6 తీసుకోవడం వలన కూడా తెల్లరక్తకణాలు పెరుగుతాయని 2011 లో ప్రచురించబడిన ఓ పరిశోధన ప్రకారం విటమిన్ బి6 న్యోట్రోఫిల్ లెవల్స్ ని పెంచుతుంది. తెల్లరక్తకణాల పెరుగుదలకి ఇది ఎంతో కీలకం.సన్ ఫ్లవర్ సీడ్స్, అరటిపండు, చికెన్, పాలకూర, నట్స్ లో విటమిన్ బి6 బాగా దొరుకుతుంది. ఆహార పదార్థాలు ఏమిటంటే విటమిన్ ఇ ఎక్కువగా ఉండే క్యారెట్, బీట్ రూట్ వంటివి తీసుకోవాలి.

విటమిన్ బి12 కూడా వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ని బాగా పెంచుతుంది. ఈ విటమిన్ ని పొందాలంటే పప్పులు, పెరుగు, చికెన్, సాల్మన్ ఫిష్ బాగా తినాలి. మరియు జింక్ అధిక మొత్తంలో లభించే గుమ్మడికాయ, పుచ్చకాయ, వెల్లుల్లి వంటివి ఎంతో ఉపయోగం. విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి వంటివి అధిక మొత్తంలో తీసుకోవాలి. జింక్ ఇమ్యునిటిని అమాంతం పెంచుతుంది.ప్రమాదం రాకముందే, ఇప్పటినుంచే జింక్ ఉండే ఆహారపదార్థాలని తినడం మొదలుపెట్టండి.గుమ్మడికాయ, పుచ్చకాయ, అల్లం, చిక్ పీస్ లో జింక్ లెవల్స్ ఎక్కువ.

గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. పాలకూర, బ్రకోలి, చిలకడ దుంపల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ లు రాకుండా నివారిస్తాయి. ఇంకా చేపలు, పాలు, పాల ఉత్పత్త్హులు వంటి వాటిలో తెల్ల రక్త కణాలను పెంచే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.