Skin : ఇంట్లో దొరికే ఆ పిండితో చర్మన్ని కాంతివంతం చేసుకోవటం ఎలాగంటే?

బియ్యం పిండి, అలో వెరా జెల్, తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

Skin : ఇంట్లో దొరికే ఆ పిండితో చర్మన్ని కాంతివంతం చేసుకోవటం ఎలాగంటే?

Rice Flour

Skin : చర్మ సౌందర్యానికి గాను మహిళలు మార్కెట్లో లభించే వివిధ రకాల క్రీములను ఉపయోగిస్తుంటారు. అయితే వాటి తయారీలో వినియోగించే రసాయనాల వల్ల మీచర్మం దెబ్బతినటమే కాకుండా కొన్ని చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే సహజ సిద్ధంగా ఇంట్లోనే లభించే కొన్ని రకాల పదార్ధాలతో చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అలాంటి వాటిలో బియ్యం పిండి కీలకమైనది. చర్మానికి బియ్యం పిండి ఉపయోగించడం వల్ల అనేక ఫలితాలు పొందవచ్చు.బియ్యపు పిండితో న్యాచురల్ స్కిన్ టోన్ ను తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. మార్కెట్లో వివిధ రకాల క్రీములు లభించని కాలంలో సైతం బియ్యపు పిండితోనే స్కిన్ టోన్ లు తయారు చేసుకుని ఉపయోగించే వారు.

బియ్యపు పిండితో చర్మానికి ఉపయోగాలు ;

బియ్యపు పిండి , ఎగ్ వైట్, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల స్కిన్ టైట్‌గా ఉంటుంది. ముడతలు మాయమవుతాయి. బియ్యం పిండి, ఓట్ మీల్, పాలపొడి మిశ్రమాలను కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని స్కిన్ టోన్‌గా ఉపయోగించుకుంటే చర్మం అందంగా మారుతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి.. అర టీస్పూన్ టమోటా జ్యూస్‌ను పేస్టులా చేసుకుని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. ఇలా రోజూ చేయడం ద్వారా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

కంటి కింద ఏర్పడే వలయాలు మాయమవ్వాలంటే.. బాగా పండిన అరటి పండు, ఆముదం, బియ్యం పిండి కలిపి ప్యాక్‌లా రాసుకుంటే డార్క్ సర్కిల్స్ మటుమాయమవుతాయి. బియ్యం పిండి, ఆలోవెరా జెల్‌, తేనె కలిపి పేస్టుగా చేసుకుని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే, ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. ఆయిలీ స్కిన్ నివారించడానికి బియ్యం పిండి చక్కటి పరిష్కారం. కార్న్ స్టార్చ్, బియ్యం పిండి కలిపి పెట్టుకోవాలి. బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఫేస్ పౌడర్ లా దీన్ని ఉపయోగిస్తే.. అదనపు ఆయిల్ ని పీల్చుకుని ముఖానికి తాజాదనాన్ని ఇస్తుంది.

బియ్యం పిండి, అలో వెరా జెల్, తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. నలుపుదనం కూడా తగ్గిపోతుంది. బియ్యం పిండి, శనగపిండి, తేనె, పంచదార, కొబ్బరినూనె కలుపుకోవాలి. దీన్ని స్ర్కబ్ లా ఉపయోగిస్తే.. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి చర్మం సాఫ్ట్గ్ గా మారుతుంది. బియ్యం పిండి, పెరుగు, యాపిల్ జ్యూస్, ఆరంజ్ జ్యూస్ కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఇది డార్క్ స్పాట్స్ తొలగించి, నిర్జీవంగా మారిన చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.