Weight : చెమటలు చిందకుండా బరువు తగ్గటం ఎలాగంటే?

తాజా పండ్లు, కూరగాయలు బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొలెస్ట్రాల్‌ స్థాయులు, రక్తపోటును నియంత్రిస్తాయి. రోగనిరోధకతను పెంచుతాయి. పండ్లు, కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి.

Weight : చెమటలు చిందకుండా బరువు తగ్గటం ఎలాగంటే?

Weight Loss

Weight : అధిక బరువుతో బాధపడేవారు బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు చెమటలు చిందేలా విపరీతమైన వర్కవుట్లు చేస్తే, మరికొందరు ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకుంటుంటారు.. మరికొందరు కడుపు మాడ్చుకుంటూ బరువు తగ్గాలని ట్రై చేస్తుంటారు. అధిక క్యాలరీలు, కొవ్వులతో నిండి ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఊబకాయంతో పాటు మధుమేహం, రక్తపోటు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అయితే తక్కువ క్యాలరీలు, పోషక విలువలు పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గటంతోపాటు అనారోగ్య సమస్యలు దరి చేరవు. రోజువారీ ఆహారంలో చక్కెర వాడకాన్ని బాగా తగ్గించుకోవాలి.ఎక్కువ మొత్తంలో మాంసకృత్తులను తీసుకోవాలి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

తాజా పండ్లు, కూరగాయలు బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొలెస్ట్రాల్‌ స్థాయులు, రక్తపోటును నియంత్రిస్తాయి. రోగనిరోధకతను పెంచుతాయి. పండ్లు, కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కేవలం వీటినే తింటూ బరువు తగ్గాలన్న ప్రయత్నం మంచిదికాదు. ఇతర పదార్థాలను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తీసుకునే ఆహారంలో అన్ని పదార్థాల నుంచి ఒకే మొత్తంలో కెలొరీలు లభ్యం కావు. కొన్ని పదార్ధాల నుండి ఎక్కువ మొత్తంలో, మరికొన్నింటి నుంచి తక్కువ మొత్తంలో లభిస్తాయి. చక్కెర, కొవ్వు పదార్థాల నుంచి చాలా ఎక్కువ కెలొరీలు అందుతాయి. కాబట్టి ఈ సూక్ష్మ పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవటం వల్ల శరీరానికి , కండరాల బలంగా ఉండేందుకు తోడ్పడతాయి. ప్రొటీన్లు ఉండే గుడ్లు, చేపలు, ఎండు ఫలాలను తీసుకోవటం మంచిది.

పేస్ట్రీలు, కేక్స్‌, కుకీస్‌.. వంటి బేకరీ పదార్థాల్లో చక్కెరలు, ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను అమాంతం పెంచుతాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల అలాంటి ఆహారాలను తీసుకోకపోవటం మంచిది. అదే క్రమంలో రోజువారి వ్యాయామాల వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు ఇందుకోసం అదేపనిగా వర్కవుట్లు చేయాల్సిన పనిలేదు. వారంలో రెండు మూడు సార్లు కాస్త కష్టమైన వ్యాయామాలు ప్రయత్నించటం మంచిది. బరువులెత్తటం వంటివి ఉపయోగకరంగా ఉంటాయి. రోజుకు 10వేల అడుగులు నడవటం, రోజుకు ఎనిమిది గంటలు నిద్రించటం వంటి వాటి వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.