Hair Fall : జుట్టు రాలే సమస్యను నివారించటం ఎలా?

విటమిన్స్ లోపం కూడా జుట్టు రాలే సమస్యకు కారణమవుతుంది. న్యూట్రిషనిస్ట్‌‌లు చెబుతున్న దానిని బట్టి కొన్ని రకాల ఆహారాలను మన రోజువారిగా తీసుకుంటే ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.

Hair Fall : జుట్టు రాలే సమస్యను నివారించటం ఎలా?

Hair Loss

Hair Fall : జుట్టు రాలిపోవటం అన్నది ఇటీవలి కాలంలో పెద్ద సమస్యగా మారింది. కరోనా ప్రారంభం తరువాత జుట్టు రాలే సమస్యను చాలా మంది చవిచూడాల్సి వస్తుంది. మారిన వాతావరణ పరిస్ధితులు, జీవనశైలి , పొల్యూషన్ జుట్టు రాలటానికి సాధారణ కారణాలైతే ప్రస్తుతం కరోనా వచ్చిన వారిలో చాలా మందిలో జుట్టు రాలిపోతున్న సమస్య కామన్ గా కనిపిస్తుంది. సుదీర్ఘ అనారోగ్యబారిన పడిన వారిలో ,శస్త్రచికిత్సలు చేయించుకున్నవారిలో, తీవ్రమైన ఇన్ఫెక్షన్, ఒత్తిడి, ధూమపానం, ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల సైతం జుట్టు రాలే సమస్య గుర్తించవచ్చు.

శరీరంలో ఆండ్రోజెన్ హార్మోన్ లేకపోవడం వల్ల జుట్టు రాలే సమస్య ఉత్పన్నమౌతుంది. థైరాయిడ్ గ్రంది సమస్యలు ఉన్న మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అంతేకాకుండా పోషకార లోపం కూడా జుట్టు రాలే సమస్యకు కారణమౌతుంది. ప్రొటీన్ మాత్రమే కాదు.. విటమిన్స్ లోపం కూడా జుట్టు రాలే సమస్యకు కారణమవుతుంది. న్యూట్రిషనిస్ట్‌‌లు చెబుతున్న దానిని బట్టి కొన్ని రకాల ఆహారాలను మన రోజువారిగా తీసుకుంటే ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. రోజు కొన్ని బాదంపప్పులు, వాల్‌నట్స్, టీస్పూన్‌ సబ్జా గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు ఆహారంగా తీసుకోవటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.

శరీరంలో బి12 విటమిన్‌ లేకుండా చూసుకోవాలి. ఈ విటమిన్ లోపముంటే కొత్త జుట్టు పెరగదు. అందుకే కొత్త జుట్టు రావాలంటే బి12 విటమిన్‌ అవసరము. డి విటమిన్‌ లోపం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉంది. విటమిన్ సి కూడా జుట్టుకు బలాన్ని ఇస్తుంది. ఇవిలభించే ఆహారాలను తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు రాలే సమస్యను దూరం చేయాలంటే జుట్టును ఎక్కువగా టైట్ గా పోనీటైల్ వేయకూడదు. హెయిర్ బ్యాండ్స్ , బన్స్ నివారించండి. బ్లో డ్రయర్స్‌ వాడడం, కాస్త వేడిగా ఉండే నూనెతో మసాజ్‌ చేయడం.. వంటివి చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. కెమికల్స్ ఉన్న హెయిర్ కలరింగ్స్ కు దూరంగా ఉండాలి. రోజూ తీసుకునే ఆహారంలో ఐరన్ మరియు ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కొన్ని రకాల సూచనలు పాటిస్తే జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు.