Corona on kids: థర్డ్ వేవ్ నుండి పిల్లలను కాపాడుకోవడం ఎలా?

కరోనా మహమ్మారి ఇంకా మన సమాజం నుండి దూరం కాలేదు. వైరస్ ఇప్పటికీ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సమాజం మహమ్మారికి తగిన వ్యాధినిరోధక శక్తిని పొందుతుంటే వైరస్ రకరకాలుగా కొత్త కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్లు అంటూ రూపాంతరం చెందుతూనే ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ మనకు పాఠాలు నేర్పినా సెకండ్ వేవ్ లో ఆచరించలేదు. అందుకు పర్యవసానంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.

Corona on kids: థర్డ్ వేవ్ నుండి పిల్లలను కాపాడుకోవడం ఎలా?

Third Wave

Third Wave: కరోనా మహమ్మారి ఇంకా మన సమాజం నుండి దూరం కాలేదు. వైరస్ ఇప్పటికీ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సమాజం మహమ్మారికి తగిన వ్యాధినిరోధక శక్తిని పొందుతుంటే వైరస్ రకరకాలుగా కొత్త కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్లు అంటూ రూపాంతరం చెందుతూనే ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ మనకు పాఠాలు నేర్పినా సెకండ్ వేవ్ లో ఆచరించలేదు. అందుకు పర్యవసానంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు థర్డ్ వేవ్ టెన్షన్ పెడుతుంది. థర్డ్ వేవ్ మరింతగా విరుచుకుపడుతుందనే హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మరీ ముఖ్యంగా ఈ మూడో వేవ్ పిల్ల‌లను ప్ర‌మాదం ముంచెత్తుతుంద‌నే వార్త‌లు కొన్ని రోజులు భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి. మొద‌టి వేవ్ వృద్ధుల‌పై ప్ర‌భావం చూపితే.. రెండో వేవ్‌లో యువ‌కులను మహమ్మారి కబళించింది. ఇక ఇప్పుడు మూడో వేవ్‌లో ర‌క్క‌సి చిన్న పిల్ల‌ల‌ను కాటేస్తుంద‌ని ఈ మ‌ధ్య ప్ర‌చారం ఎక్కువైంది. థర్డ్ వేవ్ రానుందని.. పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపనుందని ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. ఒక‌వేళ పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే వారిలో ఇన్ఫెక్ష‌న్ స్థాయి ఎలా ఉంటుందో.. ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ముందు గ్రహించి జాగ్రత్తలు పాటించడం ఉత్తమమైన మార్గంగా కనిపిస్తుంది.

పెద్ద‌ల‌తో పోలిస్తే పిల్ల‌ల్లో వైరస్ తీవ్ర‌త త‌క్కువ‌గానే ఉంటుంద‌ని నిపుణులు కొందరు అంచనా వేస్తున్నారు. అయితే కరోనా సోకిన అనంత‌రం వ‌చ్చే దుష్ప్ర‌భవాలు మాత్రం పిల్ల‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా మ‌ల్టీ సిస్టం ఇన్‌ఫ్ల‌మేట‌రీ సిండ్రోమ్ (MIS-C) వ‌చ్చే ఆస్కారం ఉండగా క‌రోనా సోకిన త‌ర్వాత రెండు నుంచి 4 వారాల‌కు కొంత‌మంది పిల్ల‌ల్లో ఇమ్యూన్‌ డిస్‌రెగ్యులేష‌న్ ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని వైద్య‌నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇమ్యూన్ డిస్‌రెగ్యులేష‌న్ కార‌ణంగా పిల్ల‌ల్లో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోయి, ఇత‌ర‌త్రా ఇన్ఫెక్ష‌న్ల‌కు గుర‌య్యే అవ‌కాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అయితే.. ల‌క్ష‌మంది పిల్ల‌ల్లో కేవ‌లం 12 కంటే త‌క్కువ మందిలోనే ఇమ్యూన్ డిస్‌రెగ్యులేష‌న్ క‌నిపించిందని.. అలా అని పిల్ల‌ల విష‌యంలో నిర్ల‌క్ష్యం ఉంటే భారీ మూల్యం చెల్లిచుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన అంద‌రూ టీకా తీసుకుంటే.. అప్పుడు ర‌క్ష‌ణ వ‌ల‌యం లేని పిల్ల‌ల విష‌యంలో అప్ర‌మ‌త్త‌త చాలా అవ‌స‌రమని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న వైద్యులు పిల్ల‌ల‌కు ఇచ్చే ఆహారంలో బీ కాంప్లెక్స్‌, సీ, డీ విట‌మిన్లు, జింక్‌, కాల్షియం, ప్రో బ‌యాటిక్స్‌, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు వంటి పోష‌కాలు అధికంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.