Diabetes : డయాబెటిస్ నుండి కాలేయాన్ని రక్షించుకోవటం ఎలా?

అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి సోడియం, కెఫిన్‌లను తగ్గించండి. ధూమపానం ,మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.

Diabetes : డయాబెటిస్ నుండి కాలేయాన్ని రక్షించుకోవటం ఎలా?

Liver

Diabetes : మధుమేహం సైలెంట్ కిల్లర్. ఇది శరీర పనితీరును దెబ్బతీస్తుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు కాలేయం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ కీలకమైన అవయవంపై ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడం వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఇది చివరకు లివర్ సిర్రోసిస్ కు దారి తీస్తుంది. ఇటీవలి కాలంలో భారతదేశంలో కాలేయ వైఫల్యం, మార్పిడికి మధుమేహం అనేది రెండవ కారణంగా నిపుణులు చెప్తున్నారు. శరీరం ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉన్న సందర్భంలో కాలేయ సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

మధుమేహం, ఊబకాయం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కి దారితీయడమే కాకుండా, కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. దీనినే నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అంటారు. కాలేయంలో కొవ్వు క్రమేపి సిర్రోసిస్ కు దారితీస్తుంది. కాలేయ వ్యాధిలో చివరి క్షణం వరకు చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో కాలేయం వ్యాధులను సులభంగా గుర్తించటం కష్టం. మధుమేహుల్లో కాలేయ క్యాన్సర్, లివర్ వైఫల్యాలు అధికంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్ ఉంటే కాలేయం విషయంలో;

1. పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. జంక్, ప్రాసెస్ చేసిన చక్కెరతో కూడిన ఆహారాలను నివారించాలి. రక్తంలో చక్కెర స్ధాయిలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి.

2. కోలాలు, సోడాలు, పండ్ల రసాలు, స్వీట్లు, బేకరీ వస్తువులు, క్యాండీలు తీసుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని గుర్తుంచుకోండి.

3.నిపుణులు సూచించిన పరిమాణంలో ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

4. తృణధాన్యాలు, తాజా పండ్లు మరియు కూరగాయలు మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామం చేయటం మంచిది.

5. స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా, జిమ్మింగ్, ఏరోబిక్స్, రన్నింగ్ లేదా జాగింగ్ వంటి వ్యాయామాలుగా ఎంచుకోవాలి. వ్యాయామాల విషయంలో అవసరమైతే వైద్యుల సూచనలు సలహాలు తీసుకోండి.

6. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి సోడియం, కెఫిన్‌లను తగ్గించండి. ధూమపానం ,మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది. కాలేయ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుంటూ వారి సూచించే విధంగా మందులను వాడుకోవటం మంచిది.