Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించటం ఎలాగంటే?

ప్రాసెస్ చేసిన మాసంలో LDL స్థాయిని పెంచే గుణం ఉంది. ప్రాసెస్ చేసిన మాంసం అధికంగా తినడం వలన గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువ.

Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించటం ఎలాగంటే?

Bad Cholesterol

Bad Cholesterol : శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉంటే అది అనేక సమస్యలను దారితీస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే రక్తనాళాలకు అడ్డుపడి గుండెపోటులు, మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలో అధిక కొలెస్ట్రాల్ కూడా ఒకటి.

చెడు కొలెస్ట్రాల్ అధికంగా పెరగడం వలన దీర్ఘకాలంలో గుండె జబ్బులు ప్రమాదాన్ని పెంచుతాయి. LDLని చెడు కొవ్వు గా చెప్పవచ్చు. ఈ చెడు కొవ్వు ధమనుల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కనుక శరీరంలో చెడు కొలస్ట్రాల్ స్థాయిని పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అధిక కొవ్వు సమస్యతో బాధపడుతుంటే అటువంటి వారు నూనెలో వేయించిన పదార్ధాలకు తినకపోవటం మంచిది. ఆలివ్ నూనె, ఆవనూనె, బాదం, వాల్‌నట్‌లు, అవకాడోలు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి అందుతుంది.

ప్రాసెస్ చేసిన మాసంలో LDL స్థాయిని పెంచే గుణం ఉంది. ప్రాసెస్ చేసిన మాంసం అధికంగా తినడం వలన గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువ. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచే కేకులు, ఐస్ క్రీం,  స్వీట్లు బేకరీ ఫుడ్స్ కు దురంగా ఉండడం మంచిది. నూనెలో వేయించిన ఆహారాలు, ఉప్పు, ఆయిల్ ఫుడ్స్ లో పోషకాలు ఉండవు. వీటిలోని అధిక కొవ్వు పదార్ధం ఉంటుంది. బీన్స్, బఠానీలు, పండ్లు, వోట్స్ మరియు తృణధాన్యాలు ఆహారంగా తీసుకోవటం ఎంతో మేలు. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయపడతాయి.

బరువు తగ్గటం ద్వారా కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా రోజు వ్యాయామాలు, నడక వంటివి కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవటం దోహదపడతాయి. గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్త వహించాలి. అవసరమైతే వైద్యుల సలహాలు, సూచనలు పాటించటం మంచిది.