Hypertension : రక్తపోటు, ఒత్తిడిని తగ్గించడానికి 8 మార్గాలు

అధిక రక్తపోటు ఎంతో ప్రమాదకరం. తీవ్రమైన ఒత్తిడి, రక్తపోటును తగ్గించేందుకు ప్రయత్నించాలని వైద్యులు సూచిస్తున్నారు. మారుతున్న జీవన విధానం, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతుండడంతో రక్తపోటు, ఒత్తిడికి గురవతుంటారు. ఒత్తిడిని తగ్గించకోవడం మూలంగా..గుండెతో పాటు ఆరోగ్యం మెరుగవుతుంది.

Hypertension : రక్తపోటు, ఒత్తిడిని తగ్గించడానికి 8 మార్గాలు

Health

Hypertension : ఉదయం లేవడం నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనుషులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. దీంతో పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో రక్తపోటు ఒకటి. అధిక రక్తపోటు ఎంతో ప్రమాదకరం. తీవ్రమైన ఒత్తిడి, రక్తపోటును తగ్గించేందుకు ప్రయత్నించాలని వైద్యులు సూచిస్తున్నారు. మారుతున్న జీవన విధానం, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతుండడంతో రక్తపోటు, ఒత్తిడికి గురవతుంటారు. ఒత్తిడిని తగ్గించకోవడం మూలంగా..గుండెతో పాటు ఆరోగ్యం మెరుగవుతుంది. ఒత్తిడి..దీర్ఘకాలిక అధిక రక్తపోటుకు కారణంమవుతుందనడానికి ఎలాంటి రుజువులు లేవని Mayo Clinic నివేదిక వెల్లడిస్తోంది. ఒత్తిడిలో ఉన్న సమయంలో శరీరంలో ఉన్న హర్మోన్లు మరింత ఉత్పత్తి చేస్తుందని వెల్లడిస్తోంది. దీని ద్వార గుండె వేగంగా కోట్టుకోవడం..రక్తపోటును తాత్కాలికంగా పెంచుతుందని తెలిపింది.

Read More : Arvind Kejriwal : ఉత్తరాఖండ్ ప్రజలకు ఆప్ అధినేత నాలుగు హామీలు

దీనిని తప్పించుకోవాలంటే 8 మార్గాలు

షెడ్యూల్ : ప్రతి రోజు షెడ్యూల్ ను రూపొందించుకోవాలి. హడావుడిగా ఉన్న సమయంలోనే ఒత్తిడి పెరుగుతుంది. రోజులో చేయాల్సిన పనులు..క్యాలెండర్ రూపొందించుకోవాలి. అనవసరమైన పనులను తొలగించాలి.

తగినంత నిద్ర : ఎన్ని పనులు చేసిన రాత్రి సమయంలో తగినంత నిద్ర పోవాల్సి ఉంటుంది. నిద్ర లేకపోతే..ఇతర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. నిద్రలేమి మానసికస్థితి, అప్రమత్తత శరీరంపై ప్రభావితం చేస్తుంది.

Read More : Hyderabad: సర్టిఫికెట్లు పోగొట్టినందుకు రూ.1.15లక్షలు చెల్లించిన బ్యాంక్

యోగా, ధ్యానం : ఆరోగ్యంగా ఉండాలంటే సరియైన నిద్ర, ఆహారంతో పాటు..వ్యాయామం అవసరం ఉంటుంది. యోగా, ధ్యానం శరీరాన్ని బలోపేతం చేస్తాయి. విశ్రాంతికి సహాయపడుతాయి. లోతైన శ్వాస తీసుకోవడం లాంటి వ్యాయామాలు చేయాలి. యోగా, ధ్యానం చేయడం వల్ల…రక్తపోటును ఐదు మిల్లీమీటర్ల వరకు తగ్గించవచ్చని Mayo Clinic తెలిపింది. ప్రాణాయామం, శ్వాస నియంత్రణ లాంటి వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

సోషల్ నెట్ వర్క్ : సోషల్ నెట్ వర్క్ ను బలోపేతం చేయాలి. ఇది ఒంటరితనం నుంచి దూరం చేస్తుంది. పలువురితో మాటలు, వారితో సంబంధాలు ఉండడం వల్ల నిరాశ, బీపీ వ్యాధుల దూరం అవుతాయి. లేనిపక్షంలో ఏదైనా సహాయక బృందంలో చేరడం, సంస్థలు చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఒత్తిడిని దూరం కావచ్చు.

Read More : New Population Policy : పాపులేషన్ పాలసీని లాంఛ్ చేసిన యూపీ సీఎం

శారీరకంగా..చురుకుదనం : శారీరకంగా చురుకుగా ఉండాలి. ఇలా ఉండాలంటే..వ్యాయాపం కంపల్సరీ. అధిక రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ అయితే వ్యాయామం చేయాలని అనుకుంటే..ముందుగా వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం బెటర్.

ఒత్తిడిని దూరం చేయండి : ఒత్తిడితో కూడుకున్న పరిస్థితులను నుంచి దూరం కావాలి. ఏదైనా సమస్య వస్తే..దానిని వెంటనే పరిష్కరించుకోవాలి. శాంతియుతమైన మార్గాల ద్వారా సమస్యకు చెక్ పెట్టాలి.

Read More : Telangana Covid Cases : తెలంగాణలో కొత్తగా 465 కరోనా కేసులు, నలుగురు మృతి

మనస్సు, శరీరం : మనస్సు, శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి. రోజు ఏదైనా ఇష్టపడే పనులు చేయాలి. తోటపని చేయడం, బుక్స్ చదవడం, ప్రయాణం చేయడం..తదితర పనులు చేయాలి. శరీరాన్ని మీరే సొంతంగా మసాజ్ చేసుకొనేందుకు ప్రయత్నించండి.

ఆహారం : ఇది అత్యంత ప్రధానం. రోజువారి ఫుడ్ లో పండ్లు, తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. డైట్ ప్లాన్ రూపొందించుకోవడం వల్ల..అధిక రక్తపోటు నుంచి దూరం కావచ్చు.
అయితే..రోజు వారి డైట్ ఫాలో అయ్యే ముందు..వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించాలి. బలవర్థకమైన ఆహారం తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల రక్తపోటు, ఒత్తిడిని దూరం అవుతుంది. సోడియం రక్తపోటును అధికం చేస్తుంది. దీనిని తక్కువగా వల్ల సమస్యను రాకుండా సహాయపడుతుంది.

Read More : ‘Ms. Shetty Mr. Polishetty’: అనుష్క శెట్టితో నవీన్ పోలిశెట్టి