Hypertension – COVID Death: బీపీ చెక్ చేసుకున్నారా? అదే కోవిడ్ మరణానికి కారణం కావచ్చు..!

హైపర్ టెన్షన్ లేదా హైబీపీ ఏదైనా సరే సీరియస్ మెడికల్ కండీషన్ కు దారితీయొచ్చు. అంతేకాదు వీటి వల్ల ప్రాణాల మీదకు కూడా వస్తుందని స్టడీ చెబుతుంది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావం మొదలై సంవత్సరం గడిచాక కూడా చాలా మందిలో అదే భయం కనిపిస్తుంది.

10TV Telugu News

Hypertension – COVID Death: హైపర్ టెన్షన్ లేదా హైబీపీ ఏదైనా సరే సీరియస్ మెడికల్ కండీషన్ కు దారితీయొచ్చు. అంతేకాదు వీటి వల్ల ప్రాణాల మీదకు కూడా వస్తుందని స్టడీ చెబుతుంది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావం మొదలై సంవత్సరం గడిచాక కూడా చాలా మందిలో అదే భయం కనిపిస్తుంది. దీని వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్లు సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి.

ఇండియాలో దాదాపు 30శాతం మందికి హైబీపీ ఉందని స్టడీలు చెబుతున్నాయి. హైపర్ టెన్షన్ లేదా హైబీపీ వల్ల సీరియస్ మెడికల్ కండీషన్ కు దారితీస్తుంది. 218మిలియన్ మందిలో ఉన్న ఈ సమస్య కారణంగా దాదాపు 10.4మిలియన్ మంది చనిపోతున్నారు.

ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌పీఏఐ) ఈ సైలెంట్ కిల్లర్ పై స్టడీ నిర్వహించారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా చాలా మంది హైబీపీ రెగ్యూలర్ చెకప్ ను విస్మరిస్తున్నారు. కొవిడ్-19తో బాధపడే వారు మెడికల్ కండీషన్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.

అంతేకాకుండా వారికి ఇచ్చిన ట్యాబ్లెట్స్ ను రెగ్యూలర్ గా వాడాలి. ప్రత్యేకించి మహమ్మారి సమయంలో ఇది తప్పనిసరి. లేదంటే ఇంటిలోనే బీపీ చెక్ చేసుకునే ఎక్విప్‌మెంట్ రెడీగా ఉంచుకోవాలి. అని ప్రాజెక్ట్ పీఆర్ఏసీహెచ్ఐ (ప్రియారిటైజింగ్ అడ్వకసీ ఫర్ కంట్రోల్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఇన్ ఇండియా) నిపుణులు అంటున్నారు. గ్లోబల్ హెల్త్ అడ్వకసీ ఇన్‌క్యూబేటర్ ద్వారా అవగాహన పెంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

10TV Telugu News