Cholesterol : కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే?…కూరగాయలు, తృణధ్యానాలు తినటం మేలు!

పెరిగిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు కొన్ని రకాల ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ప్రధానమైనవి ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు.

Cholesterol : కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే?…కూరగాయలు, తృణధ్యానాలు తినటం మేలు!

Cholesterol

Cholesterol : ఈమధ్యకాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో చెడు కొలెస్ట్రాల్ కూడా ఒకటి. చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులుకు గురికావాల్సి వస్తుంది. మనం తినే ఆహారం వల్లే శరీరంలో కొలెస్ట్రాల్ అధికస్ధాయికి చేరుకుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఒక ముఖ్యమైన భాగమే అయినప్పటికీ అతిగా ఉంటే మాత్రం ఏదైనా ప్రమాదకరమే అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుంది. అందుకు దీనిని అదుపులో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పెరిగిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు కొన్ని రకాల ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ప్రధానమైనవి ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు. వీటిని తీసుకోవటం వల్ల కొవ్వును కరిగించుకుని గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు. కూరగాయలను అధికంగా తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది. వంకాయ, బెండకాయ, బ్రకోలి, చిలగడ దుంప వంటి వాటిని తీసుకోవటం వల్ల చెడు కొవ్వు కరిగిపోతుంది.

వివిధ రకాల గింజలను తీసుకోవటం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. నట్స్ లో ఉండే ప్రొటీన్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. బార్లీ వంటి తృణధాన్యాలను తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ స్ధాయిలు నియంత్రించబడతాయి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్‌ను కలిగి ఉన్న చేపలను తీసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. గుండె జబ్బులు దరిచేరకుండా చూడవచ్చు. సోయా బీన్స్ అనేవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు బెస్ట్ ఫుడ్ గా చెప్పవచ్చు. ప్రతిరోజు సోయా ఉత్పత్తులను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఓట్స్ ను ఉదయం అల్పాహారంగా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆలివ్ నూనె, ఆవనూనె, బాదం, వాల్‌నట్‌లు, అవకాడోలు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి అందుతుంది. రోజు వారి వ్యాయామాలు చేయటం వల్ల కూడా కొలెస్ట్రాల్ తీవ్రతను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. బరువు తగ్గటం వల్ల కొలెస్ట్రాల్ స్ధాయిలను నియంత్రించుకోవచ్చు. అనేక పండ్లలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించటంలో సహాయపడుతుంది. పండ్లలో ఉండే ఒక రకమైన కరిగే ఫైబర్, కొలెస్ట్రాల్‌ను 10% వరకు తగ్గిస్తుంది. యాపిల్స్, ద్రాక్ష, సిట్రస్ పండ్లు,స్ట్రాబెర్రీలు వంటి ఫ్రూట్లలో బయోయాక్టివ్ పదార్థాలు కూడా ఉన్నాయి, వాటి ద్వారా లభించే యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గుండె జబ్బులు , ఇతర దీర్ఘకాలిక వ్యాధులను నివారించచచ్చు.