Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!

గర్భిణీగా ఉన్నప్పుడు తల్లి పడే టెన్షన్‌ వలన పుట్టబోయే బిడ్డలకు కూడా ఒత్తిడి సమస్య సంక్రమిస్తుంది. కాబట్టి ఒత్తిడి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొన్ని రకాల కాస్మొటిక్స్ లో వివిధ రకాల కెమికల్స్ కలుపుతుంటారు.

Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!

Pregnant Women

Pregnant Women : స్త్రీలు గర్భం దాల్చినప్పుడు అనేక జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. గర్భం ధరించింది మొదలు బిడ్డకు జన్మనిచ్చేంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.. గర్భం ధరించిన తరువాత తొమ్మిది మాసాల కాలంలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఒకవైపు పోషకాహారం తీసుకుంటూ బిడ్డ పెరుగుదలపై దృష్టిపెట్టాలి. గర్భిణిలకు ఎన్నో సందేహాలు మనస్సులో ఉన్నా వాటిని నివృత్తి చేసుకునేందుకు ఏమాత్రం అవకాశం ఉండదు. అలాంటి వారి కోసం నిపుణులు కొన్ని జాగ్రత్తలు, సూచనలు అందిస్తున్నారు. వాటి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం…

తొలి మూడు నెలలను ఫస్ట్ ట్రైమిస్టర్ అని, నాలుగు నుంచి ఆరునెలల కాలాన్ని రెండో ట్రైమిస్టర్ అని, ఏడో నెల నుంచి డెలివరీ అయ్యేవరకు ఉన్న సమయాన్ని మూడో ట్రైమిస్టర్ అని అంటాం. ఈ తొమ్మిది మాసాల సమయంలో అనేక జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. గర్భం ధరించిన స్త్రీలు ముఖ్యంగా చేయించుకోవాల్సిన పరీక్ష రక్తహీనత పరీక్షలు. ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా కల ఆహార పదార్థాలు తినాలి. ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగాలి. రోజూ ఒక గుడ్డు తినాలి. రోజూ పండ్లు కూడా తినాలి. ఆరు బయట నడిచేటప్పుడు ఎప్పుడూ చెప్పులు వేసుకోవాలి.మొలలు, అధిక రక్తస్రావం, మలేరియా వంటి సమస్యలకు చికిత్స తీసుకోవాలి. ఎం.జి. ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వాడాలి. గర్భిణీ స్త్రీలకి సకాలంలో టి.టి. ఇంజక్షను ఇప్పించాలి.

గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువగా చమట పడుతుంది. ఈస్ట్రోజన్‌ స్థాయిలు తగ్గి , ఉష్ణోగ్రత మార్పులకు సున్నితత్వం పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి . కొబ్బరి నీరు, నిమ్మరసం, ఫ్రూట్ జూస్లు ఎక్కువగా తీసుకోవాలి. దాని వల్ల మూత్రం ఇన్ఫెక్షన్ రాదు. గర్భం ధరించాక ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. జీర్ణం అయ్యే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. పిండిపదార్దాలున్న పప్పులు, ధాన్యాలు, గోధుమలు, బియ్యం, జొన్నలు, రాగులు, బంగాళ దుంపలు, కర్రపెండలం, చిలగడదుంపలు, అరటి, బ్రెడ్, పండ్లు వీటితో పాటు మాంసకృత్తులు ఎక్కువగా వున్నఆహారం తీసుకోవాలి. పప్పులు, చిక్కుళ్ళు, వేరుశనగలు, సోయబీన్సు, పచ్చటి ఆకుకూరలు బాగా తీసుకోవాలి.

ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఒక సారి థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. థైరాయిడ్ పనిలో హెచ్చు తగ్గులు వలన గర్భస్రావం జరగవచ్చు. కడుపులో శిశువు పెరుగుదలను అడ్డుకొంటుంది. గర్భిణీ స్తీలు ఎక్కువ బరువు పనులు చేయకూడదు. ప్రత్యేకంగా నెలలునిండిన సమయంలో అస్సలు చేయకూడదు. అది కూడా డాక్టర్ సలహా ప్రకారమే నడుచుకోవాలి. ఇలా చిన్న చిన్న వ్యాయామాలు, వాకింగ్ చేయటం వల్ల సుఖ ప్రసవం జరుగుతుంది. నిద్రకు ఉపక్రమించే ముందు వేడిపాలు త్రాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది.

గర్భిణీగా ఉన్నప్పుడు తల్లి పడే టెన్షన్‌ వలన పుట్టబోయే బిడ్డలకు కూడా ఒత్తిడి సమస్య సంక్రమిస్తుంది. కాబట్టి ఒత్తిడి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొన్ని రకాల కాస్మొటిక్స్ లో వివిధ రకాల కెమికల్స్ కలుపుతుంటారు. కాబట్టి చర్మానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సెల్ ఫోన్లో ఎక్కువ సమయం మాట్లాడటం ఏమాత్రం మంచిదికాదు. పుట్టబోయే బిడ్డపై రేడియేషన్‌ ప్రభావం అధికంగా ఉంటుంది. హై హీల్స్ ఎత్తుమడమల చెప్పులు వాడకూడదు. కాళ్ళకు కరెక్ట్ గా సరిపోయే చెప్పులను, సౌకర్యవంతమైన చెప్పులను ధరించాలి. శరీరానికి వేడి తగలకుండా జాగ్రత్త పడాలి. శరీరాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుకోవాలి. వేడి వేడి నీటితో స్నానం చేయకూడదు. గోరు వెచ్చని నీటిని మాత్రమే వాడాలి. గర్భంతో ఉన్న సమయంలో నిపుణుల సూచనలు పాటిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే పండంటి బిడ్డను పొందవచ్చు.