రోజువారి ఆహారం పద్దతి ప్రకారం తీసుకుంటే!

మనం తీసుకునే ఆహారాన్ని 4 గంటలకు ఒకసారి తీసుకోవటం అలవాటుగా మార్చుకోవాలి. తినే ప్రతిసారీ కడుపు నిండా తినకుండా కొద్ది మొత్తంలో తీసుకోవాలి. ఒకసారి ఆహారం తీసుకుంటే ఆ ఆహారం బాగా జీర్ణమైన తరువాత తిరిగి ఆహారం తీసుకోవాలి.

రోజువారి ఆహారం పద్దతి ప్రకారం తీసుకుంటే!

మనిషి బ్రతకటానికి ఆహారం అనేది అత్యవసరమైనది. అయితే తీసుకునే ఆహారం ఓ పద్దతి ప్రకారం ఉండాలి. ఇలా ఉంటే తిన్న ఆహారం మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటమేకాక జీవక్రియలు సాఫీగా సాగేందుకు దోహదం చేస్తుంది. అలా కాకుండా ఎలా పడితే అలా, ఏది పడితే అది ఆహారంగా తీసుకుంటే కోరి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే రోజువారిగా తీసుకునే ఆహారాన్ని పద్ధతి ప్రకారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

ఆహారాన్ని ఎలా తీసుకోవాలి ;

మనం తీసుకునే ఆహారాన్ని 4 గంటలకు ఒకసారి తీసుకోవటం అలవాటుగా మార్చుకోవాలి. తినే ప్రతిసారీ కడుపు నిండా తినకుండా కొద్ది మొత్తంలో తీసుకోవాలి. ఒకసారి ఆహారం తీసుకుంటే ఆ ఆహారం బాగా జీర్ణమైన తరువాత తిరిగి ఆహారం తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోకూడదు. కొవ్వుతో నిండిన ఆహారాన్ని తీసుకునేలా చేసేది ఉప్పే కాబట్టి ఉప్పును ఎంత తక్కువ మోతాదులో ఆహారంలో వాడితే అంత మంచిది.

ప్రోటీన్‌, ఫైబర్‌ మరియు ఫాట్‌తో కూడిన ఆహారాన్ని కూడా తీసుకుంటూ వుండాలి. కార్బోహైడ్రేడ్లు అధికంగా గల అన్నాన్ని మితంగా తీసుకోవాలి. తాజా కూరగాయల్ని ఆహారంలో మూడుపూటలా ఉండేలా చూసుకోవాలి. ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు తీసుకున్న 2 గంటల తర్వాత పండ్లను తీసుకోవచ్చు. పండ్లను సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు. నాలుగైదు పండ్లను ఒకసారి తినేయడం మంచిది కాదు.

ఇలా ఆహారాన్ని ఒక పద్దతి ప్రకారం తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే చాలా మందికి ఆహారం ఎలా తీసుకోవాలన్న విషయంపై సరైన అవగాహన ఉండదు. అలాంటి వారు సమీపంలోని పోషకాహార నిపుణులను కలిస్తే వారి ద్వారా సూచనలు, సలహాలు పొందవచ్చు. తద్వారా తీసుకునే ఆహారపు అలవాట్లను మార్పు చేసుకోవచ్చు.