Fasting Diet : ఉపవాసాలు ఉండే వారు నీరసం లేకుండా ఉండాలంటే వీటిని తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది!

బొప్పాయి, యాపిల్‌, జామ వంటి పండ్లను గంటకు ఒకటి తీసుకున్నా చాలు. శరీరానికి పోషకాలు అందుతాయి. నీరసం దరిచేరదు. పండ్ల రసాలకు దూరంగా ఉంటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Fasting Diet : ఉపవాసాలు ఉండే వారు నీరసం లేకుండా ఉండాలంటే వీటిని తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది!

Fasting Diet : పండగరోజుల్లో చాలా మంది ఉపవాసాలు ఉంటుంటారు. ఉపవాసం వల్ల నీరసం వస్తుంది. అలానే దాని వలన ఇతర అనారోగ్య సమస్యలు కూడా మీ దరి చేరే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం కొంతవరకు మంచిదే అయినప్పటికీ అలాగని శరీరాన్ని నీరసంగా, నిరుత్సాహంగా మార్చకూడదు. ఉపవాసాల సమయంలో తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం మంచిది. ఉపవాసం ఉంటున్నామని పూర్తిగా ఆహారం మానేయాల్సిన పనిలేదు. భోజనానికి బదులుగా పండ్లను , పండ్ల రసాలను తీసుకోవచ్చు. ఇవి బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తాయి.

పనీర్‌, పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు తక్షణ శక్తినిస్తాయి. ప్రొటీన్లు, కాల్షియం అందేలా చేస్తాయి. రాత్రి సమయాల్లో అల్పాహారంగా ఒక జొన్నరొట్టె, సగ్గుబియ్యం కిచిడీ, అటుకులు లేదా మరమరాల ఉప్మా వంటివి తీసుకుంటే తేలికగా జీర్ణమవుతాయి. శక్తినిస్తాయి. ఏడెనిమిది గ్లాసుల నీటిని తాగితే డీహైడ్రేషన్‌ కాదు. ఎండు ఫలాలను కొద్ది మోతాదులో తీసుకోవచ్చు. వీటి వల్ల శరీరానికి కావాల్సినన్ని పోషకాలు అందుతాయి. పీచుతో కూడిన పండ్లను తీసుకోవాలి. వీటి వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో మలినాలు బయటకు వెళతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. పీచు ఎక్కువగా ఉండే గింజ ధాన్యాలు, ఆకుకూరలు, బంగాళాదుంప, చిలగడదుంప వంటివి తప్పక తీసుకోవాలి.

టొమాటో, కీరదోస, క్యారెట్‌, ఉడికించిన ఆకు కూరలు వంటివి తీసుకుంటే మంచిది. బొప్పాయి, యాపిల్‌, జామ వంటి పండ్లను గంటకు ఒకటి తీసుకున్నా చాలు. శరీరానికి పోషకాలు అందుతాయి. నీరసం దరిచేరదు. పండ్ల రసాలకు దూరంగా ఉంటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పండ్ల రసాలు తీసుకోవటం వల్ల చక్కెర అధికంగా శరీరంలో చేరే ప్రమాదం ఉంటుంది. సూక్ష్మపోషకాలు ఉండే గింజధాన్యాలు ప్రొటీన్లు సహా ఆరోగ్యకరమైన కొవ్వు, పీచు, ఖనిజ లవణాలను అందిస్తాయి. తృణధాన్యాలతో తయారు చేసిన స్నాక్స్ తీసుకోవచ్చు. వీటిలో ఇనుము, కాల్షియం, పీచు, ప్రొటీన్లు, మెగ్నీషియం వంటివి ఉంటాయి. దీన్ని ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడితే మంచిది. ఉపవాసం చేసేటప్పుడు జంక్ ఫుడ్ తినకూడదు. అలానే అనారోగ్యం కలిగించే వాటిని కూడా తీసుకోకూడదు. అదే విధంగా ఉపవాసం సమయంలో ఆరోగ్యానికి హాని చేసే చిప్స్ వంటివి కూడా తీసుకోకూడదు.