కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయా? ఇంట్లోనే ట్రీట్ మెంట్!

  • Published By: sreehari ,Published On : April 29, 2020 / 04:31 AM IST
కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయా? ఇంట్లోనే ట్రీట్ మెంట్!

కరోనా వైరస్ స్వల్ప లక్షణాలున్న వారంతా ఇంట్లోనే చికిత్స పొందవచ్చు. వ్యాధి సోకినా వారిలో లక్షణాలు లేకపోయినా సరే వారిళ్లలోనుంచే చికిత్స తీసుకోవచ్చు. సెల్ఫ్ క్వారంటైన్ సౌకర్యాలు ఉన్న ఇళ్లలోనే ఉండి ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడూ ప్రభుత్వ వైద్య సిబ్బందికి సహకరిస్తూ అవసరమైన సమయాల్లో వైద్య సాయం పొందేలా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనాకు సంబంధించి లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నాయా? ఎలాంటి లక్షణాలు లేవా అనేది ముందుగా వైద్యుడు నిర్ధారించాల్సి అవసరం ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తులను ఇళ్లలో సౌకర్యాలను బట్టి వారి కుటుంబ సభ్యులతో కలవకుండా విడిగా ఓ గదిలో ఉండొచ్చు. 

ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య సిబ్బందితో ఎప్పుటికప్పుడూ సమాచార మార్పిడికి అనుగుణంగా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యే సేతు యాప్ ను మొబైల్స్‌లో తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలి. బ్లూటూత్, వైఫై సర్వీసులను మొబైల్‌లో నిరంతరం పనిచేస్తుండాలి. జిల్లా వైద్యాధికారికి, వైద్య సిబ్బందికి తమ ఆరోగ్యాన్ని గురించి ఎప్పటికప్పుడూ తెలియజేస్తుండాలి. నిర్దేశిత గడువు పూర్తి అయిన తర్వాత కరోనా పరీక్షకు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలి. 

నెగటివ్ అని నిర్ధారణ అయితే ఇంట్లోనే ఐసోలేషన్ నుంచి విముక్తి పొందవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు అస్వస్థతగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. 1075 నెంబర్లకు ఫోన్ చేయాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు, ఛాతిలో నిప్పిగా ఉన్నప్పుడు, గందోరగోళంగా అనిపించడం, చేతులు చచ్చుబడినట్టుగా అనిపించడం, పెదవులు, ముఖం నీలిరంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అయి వైద్య సాయం తీసుకోవాలి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే :
* మూడంచెల మాస్క్ ధరించాలి. 8 గంటలకొకసారి మార్చేయాలి.
* వాడిన మాస్క్ మళ్లీ వాడొద్దు.. సోడియం హైపోక్లోరైడ్ లిక్విడ్ తో క్లీన్ చేసి పారేయాలి.
* చిన్న పిల్లలు, వృద్ధులు, అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాలు, గుండె, కాలేయ సమస్యలున్నవారికి దూరంగా ఉండాలి. 
* ఇంట్లో సాధ్యమైనంత వరకూ విశ్రాంతి తీసుకోవాలి.
* నీరసంగా ఉండకుండా నీరు, ఇతర జ్యూస్ వంటి లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి.
* చేతులను ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో ఎప్పటికప్పుడూ క్లీన్ చేయాలి.
* బాధిత వ్యక్తి వాడిన దుస్తులు, వస్తువులను మరొకరు వాడకూడదని గుర్తించుకోండి.