Jackfruit Seeds : పనస విత్తనాల వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు గురించి తెలిస్తే అసలు వదిలిపెట్టరు!

పనసపండు విత్తనాలను పాలల్లో రెండు స్పూన్లు వేసి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కుంటే ముఖంపై మచ్చలు వంటివి తొలగిపోతాయి. దీనిలో ఐరన్‌శాతం ఎక్కువ. అనీమియాతో పాటు ఇతర రక్తసంబంధ వ్యాధులు దరిచేరకుండా చూస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.

Jackfruit Seeds : పనస విత్తనాల వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు గురించి తెలిస్తే అసలు వదిలిపెట్టరు!
ad

Jackfruit Seeds : పనసపండు లోపలి విత్తనాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే చాలా మంది వీటిని ఎందుకు పనికి రావని పడేస్తుంటారు. పనస విత్తనాలలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పనస విత్తనాలతో తయారైన పొడిలో థయామిన్‌, రైబోఫ్లోవిన్‌, మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఐరన్, కాల్షియం,కాపర్ వంటి మినరల్స్ ఉన్నాయి. మెటబాలిజం పెంచటంతోపాటు కండరాల నిర్మాణానికి ఈ విత్తనాల్లోని ప్రొటీన్లు దోహదపడతాయి.

పనస విత్తనాలలో ప్రొటీన్లు, మైక్రో న్యూట్రిన్లు అధికంగా ఉండటం వల్ల వీటిని తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. కొన్ని రకాల చర్మ వ్యాధులు తొలగి పోతాయి. జీర్ణాశయంలోని ఆహారం త్వరగా అరగడానికి ఉపయోగపడుతుంది. పనసపండు విత్తనాల పొడిని జీర్ణాశయ సంబంధ వ్యాధులను తగ్గించటానికి వీటిని ఉపయోగిస్తారు. ఫైబర్ అనేది పనసవిత్తనాలలో సమృద్ధిగా లభిస్తుంది.

పనసపండు విత్తనాలను పాలల్లో రెండు స్పూన్లు వేసి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కుంటే ముఖంపై మచ్చలు వంటివి తొలగిపోతాయి. దీనిలో ఐరన్‌శాతం ఎక్కువ. అనీమియాతో పాటు ఇతర రక్తసంబంధ వ్యాధులు దరిచేరకుండా చూస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. ఈ విత్తనాల్లో ఎవిటమిన్‌ ఉండటం వల్ల కంటికి ఉపయోగకరంగా చెప్పవచ్చు.

పనసవిత్తనాలలో రోగనిరోధక శక్తిని పెంపొందించే గుణాలు ఉన్నాయి. పనసవిత్తనాల్లోని జింక్ రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. పనసవిత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్ డేమేజ్ నుంచి రక్షిస్తాయి.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి చికిత్స పొందటం మంచిది.