Back Pain : వెన్నునొప్పి బాధిస్తుంటే ఉపశమనం కోసం పాటించాల్సిన జాగ్రత్తలు!

వెన్ను సమస్యల నుంచి మనం బయటపడడానికి మన కండరాలు ఎప్పటికప్పుడు సాగదీస్తూ లేదా మసాజ్ చేస్తూ ఉండాలి. ఒకేసారి బరువులు పైకి ఎత్తేముందు మన శరీరానికి కొన్ని ఎక్సర్సైజులు అలవాటు చేయాలి మనం ప్రతీ రోజూ చేసుకునే చిన్న చిన్న ఎక్సర్ సైజ్ శరీరానికి అలవాటు పడిన తరువాత మాత్రమె బరువులు ఎత్తడం వంటివి చేయాలి.

Back Pain : వెన్నునొప్పి బాధిస్తుంటే ఉపశమనం కోసం పాటించాల్సిన జాగ్రత్తలు!

Back Pain : వెన్నునొప్పి అనేది సర్వ సాదారణంగా వచ్చే సమస్యల్లో ఒకటి. వంగి పని చేసే వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. నీరసంగా ఉన్నప్పుడు అధిక బరువులు ఎత్తడం వల్ల కూడా సమస్య వస్తుంది. ప్రస్తుతం యవ్వన వయసు గల వారి నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతీ ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. శరీరం దృడంగా గా లేని వాళ్ళు ఫిట్ గా ఉండాలనే కోరికతో ఒకేసారి ఎక్కువ బరువులను ఎత్తుతుంటారు. అలా ఒకేసారి అధిక బరువులు ఎత్తడం వల్ల మన శరీర వెనక కండరాలపై చాలా ఒత్తిడి పడుతుంది దానివల్ల వెన్ను నొప్పి వస్తుంది. ఒకేసారి అదిక బరువులు ఎత్తకుండా జాగ్రత్తగా ఉండాలి.

వెన్ను సమస్యల నుంచి మనం బయటపడడానికి మన కండరాలు ఎప్పటికప్పుడు సాగదీస్తూ లేదా మసాజ్ చేస్తూ ఉండాలి. ఒకేసారి బరువులు పైకి ఎత్తేముందు మన శరీరానికి కొన్ని ఎక్సర్సైజులు అలవాటు చేయాలి మనం ప్రతీ రోజూ చేసుకునే చిన్న చిన్న ఎక్సర్ సైజ్ శరీరానికి అలవాటు పడిన తరువాత మాత్రమె బరువులు ఎత్తడం వంటివి చేయాలి. దాని వల్ల కండరాలు కూడా వ్యాయామం అవుతుంది. ఒకే చోట వెన్ను కిందకు వాల్చి ఎక్కువ సేపు కూర్చోకూడదు,వంగకూడదు. దీనివల్ల వెన్ను పూసల్లో గ్యాప్ వచ్చి అవి వెన్ను నొప్పి వస్తుంది.

ఆఫీస్ లో గాని ఇంటి వద్ద కాని పనిచేసే సమయంలో వెన్ను నిటారుగా పెట్టి పనిచేసుకూవాలి. మధ్యమధ్యలో ఒక సారి నిటారుగా లేచి అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోవాలి దీనితో వెన్నుముఖ పై అదిక ప్రభావం పడకుండా ఉంటుంది. శరీరాన్ని ఎప్పుడూ దృడంగా గా ఉంచుకోవాలంటే పండ్లు ,కూరగాయలు తింటూ ఉండాలి. ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలి. మనం రోజూ తినే భోజనం కూడా ఒక డైట్ ప్రకారం తీసుకోవాలి. దాని వల్ల మన శరీరం ఫిట్ గా ఉంటుంది మరియు వెన్నుముఖ ఆరోగ్యాంగా ఉంటుంది.

వ్యాయామానికి టైమ్ కేటాయించండి. ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి ప్రభావం ముఖ్యంగా మెడనొప్పి, భుజాలు, వెన్ను నొప్పి వెంటాడుతుంది. శరీరానికి తగిన విశ్రాంతి అందించండి. దీని వల్ల కండరాలన్నీ కొత్త ఉత్తేజం పొందుతాయి. నిద్రను నిర్లక్ష్యం చెయ్యకండి. రోజుకు 7 నుండి 8గంటలు నిద్రకు కేటాయించండి. వెన్ను నొప్పి తీవ్రంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన వైద్య సహాయం పొందండి.