’IKIGAI‘ The Japanese Secrets : జపాన్వాసుల ఆయుర్దాయం వెనక ‘ఇకిగయ్’ సీక్రెట్..
వందేళ్లు కాదు.. దృష్టిసారిస్తే 150 ఏళ్లు బతకొచ్చని సైంటిస్టులు అంటున్నారు.. జపాన్వాసుల వయసు ఆ స్థాయిలో పెరగడం వెనక గొప్ప కాన్సెప్ట్ కారణంగా కనిపిస్తోంది. అదే ఇకిగాయ్ ! జపాన్వాసుల ఆరోగ్య విధానాల్లోనే మార్పు తీసుకువచ్చింది. అసలేంటీ ఇకిగాయ్ ?

’IKIGAI‘ The Japanese Secrets : వందేళ్లు కాదు.. దృష్టిసారిస్తే 150 ఏళ్లు బతకొచ్చని సైంటిస్టులు అంటున్నారు.. కాకపోతే కండిషన్స్ అప్లయ్ అంటున్నారు. ఇక అటు జపాన్వాసుల వయసు ఆ స్థాయిలో పెరగడం వెనక గొప్ప కాన్సెప్ట్ కారణంగా కనిపిస్తోంది. అదే ఇకిగాయ్ ! జపాన్వాసుల ఆరోగ్య విధానాల్లోనే మార్పు తీసుకువచ్చింది. అసలేంటీ ఇకిగాయ్ ?
శతమానం భవతి.. వందేళ్లు బతకాలంటూ పెద్దల మనసుల నుంచి వచ్చే దీవెన. ప్రపంచంలో ఎక్కడైనా వయసుకు పూర్తి కొలమానం వందేళ్లుగానే లెక్కలేస్తారు. జపాన్‌లో సెంచరీ క్రాస్ చేస్తున్న వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ఐతే జపాన్‌లో మాత్రమే కాదు.. మిగతా ప్రాంతాల్లో వందేళ్లు కాదు.. 150 ఏళ్లు జీవించవచ్చని సింగపూర్‌కు చెందిన జెరో అనే బయోటెక్ సంస్థ పరిశోధకులు ఇచ్చిన రిపోర్టు ఆసక్తికర చర్చకు దారి తీసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఓ మనిషి గరిష్ఠంగా 120 నుంచి 150 ఏళ్ల దాకా బతకడానికి అవకాశాలున్నాయని ఆ శాస్త్రవేత్తలు లెక్క తేల్చారు. ఐతే ఎన్నేళ్లు బతికినా మరణం అనేది తప్పదని.. మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు, నడక, చేసే పనుల మీదే అది ఆధారపడి ఉంటుందని వాళ్లు చెప్తున్నారు.
Also read : Man 100 Years : 100 ఏళ్లు జీవించటం మన చేతుల్లోనే ఉంది అంటున్న శాస్త్రవేత్తలు..
గరిష్ట వయసు నిర్ధారించేందుకు రక్త కణాలు, జనాలు రోజూ చేస్తున్న పనులను సింగపూర్ సైంటిస్టులు విశ్లేషించారు. అమెరికా, బ్రిటన్, రష్యా ప్రజలపై అధ్యయనం నిర్వహించారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలోని రక్తకణాలు తగ్గడం మొదలవుతుందని… ఆ రక్తకణాలు ఎంత వేగంగా తగ్గిపోతే అంత వేగంగా వృద్ధాప్యం వస్తుందని… అంతే త్వరగా మరణమూ సంభవిస్తుందని తేల్చారు. ఈ లెక్కన 120 నుంచి 150 ఏళ్ల మధ్యే రక్తకణాలు చాలావరకు తగ్గిపోయి శరీర పటుత్వం పడిపోతుందని తేల్చారు. ఐతే మరో షాకింగ్ విషయాన్నీ సైంటిస్టులు గుర్తించారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్యే రక్తకణాలు తగ్గడం మొదలవుతుందని తేల్చారు. తద్వారా శరీరం కొద్దికొద్దిగా శక్తిని కోల్పోతుంటుందని వివరించారు. ఆ వయసులో ఎదుర్కొనే ఒత్తిళ్లూ అందుకు కారణమవుతున్నాయని చెప్తున్నారు.
Also read : PM Modi Mother 100th Birthday : తల్లి 100వ పుట్టిన రోజు..పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వయసు సంబంధిత వ్యాధులను నయం చేయడానికి.. ఇప్పుడున్న చికిత్సలతో మహాఅయితే కొన్నేళ్లు వయసును పెంచుకోవచ్చు కానీ.. గరిష్ఠ వయసు వరకు బతకడం మాత్రం కష్టమన్నది సైంటిస్టుల మాట. అందుకే ఒత్తిడికి ఎంతలా దూరంగా ఉంటే.. వృద్ధాప్యం దూరమై… మనిషి ఆయుర్ధాయం అంతలా పెరుగుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. మంచి ఆహారంతో పాటు.. మంచి వాతావరణం.. కష్టాలు చెప్పుకునే నేస్తం.. ఆరోగ్య శైలిలో మార్పులు తీసుకువస్తాయని అంటున్నారు. జీవితాలు హ్యాపీగా ఉండాలంటే ఎలా అంటూ.. జపాన్‌లో తీసుకువచ్చిన ఓ విధానం.. అక్కడి ప్రజల ఆలోచలనలు.. ఆరోగ్యాలను మార్చేసింది. ప్రస్తుతం వయోధికులు ఎక్కువగా ఉండడం వెనక కూడా అది కారణం అనేవాళ్లు ఉన్నారు.
జపాన్‌లో ‘ఇకిగయ్’ (’IKIGAI‘)అనే జీవన విధానం తీసుకువచ్చారు. ఇకిగయ్… అంటే, నిత్యం ఏదో ఓ వ్యాపకంలో తలమునకలై ఉండటంలోని ఆనందం! మనకు ఆనందాన్నిచ్చే పనేమిటన్నది తేల్చుకోగలిగితే చాలు. ఆనంద ద్వారాలు వారగా తెరుచుకున్నట్టే. ఆ స్పష్టతే… మన జీవితానికి సంబంధించినంత వరకూ ఇకిగయ్! ఒక్కసారి ఆ స్పష్టత వచ్చేయగానే… జీవితాన్ని మనం చూసే కోణమే మారిపోతుంది. తమ ఇకిగయ్కి దగ్గరగా ఉండే వృత్తి ఉద్యోగాల్ని ఎంచుకున్నవారే, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు. ఇకిగయ్ అంటే.. అదేదో వైద్య విధానం కాదు.. జీవన విధానం. అలాంటి అలవాట్లు చేసుకున్నారు కాబట్టే.. జపాన్వాసుల ఆయుర్దాయం పెరుగుతోంది.
Also read : ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన 110 ఏళ్ల బామ్మ
ప్రతీ ఒక్కరికి ఆనందాన్ని ఇచ్చే పనులు కొన్ని ఉంటాయ్. జీవితానికి అర్థాన్నీ పరమార్థాన్నీ ప్రసాదించే వ్యాపకాలు ఉంటాయ్. దానిచుట్టూ జీవితాల్ని అల్లేసుకోవడమే ఇకిగయ్. అందుకే పదవీ విరమణ తర్వాత జపాన్‌వాసులు సెకండ్ లైఫ్ స్టార్ట్ చేస్తారు.. సెకండ్ కెరీర్ ఎంచుకుంటారు. వచ్చిన పని నచ్చినట్లు చేయడమే వందేళ్ల జీవితం. వందేళ్ల తర్వాత జీవితం కూడా అదే ! ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో వందేళ్లు బతకడం అసాధ్యం అన్న మాటను ఖండించేలా పరిశోధనలు జరుగుతున్నాయ్. వృద్ధాప్యాన్ని దూరం చేసేలా.. వయసు పెంచేలా ప్రయోగాలు జరుగుతున్నాయ్. ఎన్ని ప్రయోగాలు జరిగినా.. ఏం చేసినా.. ఒక్కటి మాత్రం నిజం.. మనసు హ్యాపీగా ఉంటే.. మెదడు హ్యాపీగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు వయసు మరింత పెరగడం ఖాయం.
1Umesh Murder : ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
2Maharashtra: ‘మహా’ అసెంబ్లీలో నేడే బల పరీక్ష
3Nupur Sharma : నుపుర్ శర్మపై లుక్ అవుట్ సర్క్యులర్
4Jasprit Bumrah: బ్రియాన్ లారా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా
5BJP Sabha : నేడు బీజేపీ విజయ సంకల్ప సభ..పరేడ్ గ్రౌండ్లో సర్వం సిద్ధం
6Metro Trains : నేడు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
7Punjab Man: డ్రగ్స్ తీసుకోకుండా అడ్డుకోవడానికి కొడుకును చైన్లతో కట్టేసిన తల్లి
8UP CM Yogi : పాతబస్తీ భాగ్యలక్ష్మిఅమ్మవారిని దర్శించుకోనున్న యూపీ సీఎం యోగి..చార్మినార్ వద్ద భారీ బందోబస్తు
9IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
10Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
-
TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
-
Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
-
Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
-
Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
-
Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
-
BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
-
India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!