Toothpaste : టూత్ పేస్ట్ తో చర్మసౌందర్యం మెరుగు…ఎలాగంటే?…

ముఖంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించడానికి టూత్‌పేస్ట్, నిమ్మ రసం మరియు ఉప్పు లేదా చక్కెర కలయికను ఉపయోగిస్తే చేస్తే మంచి ఫలితం ఉంటుంది

Toothpaste : టూత్ పేస్ట్ తో చర్మసౌందర్యం మెరుగు…ఎలాగంటే?…

Skin Beauty

Toothpaste : టూత్ పేస్ట అంటే కేవలం దంతాలను మాత్రమే శుభ్రం చేసుకోవటానికే అన్న విషయం చాలా మందికి తెలుసు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏటంటే టూత్ పేస్టుతో ఎన్నో రకాల ఉపయోగాలు, ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖం పై మొటిమలు తగ్గించేందుకు కూడా టైత్ పేస్టు బాగా ఉపయోగపడుతుంది. రాత్రిపూట మొటిమలపై పేస్టు రాసి.. ఉదయాన్ని కడిగేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. ముఖంపై ఏర్పడిన ముడతలు, మచ్చలను తొలగించడానికి టూత్ పేస్టు ఉపయోగపడుతుందట. రాత్రిపూట ముడతలు ఉన్న ప్రదేశంలో కొద్దిగా టూత్ పేస్టు రాసి, ఉదయాన్నేనీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముడతలు తగ్గిపోతాయి.

ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో కొంచెం టూత్ పేస్ట్ వేయండి. కొంచెం తేనె వేసి కలపండి. దాన్ని మీ ముఖానికి రాయండి. 15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి. అలా కొన్ని రోజుల పాటు చేయంటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ ముఖం మీద మొటిమలే ఉండవు. బ్లాక్ హెడ్స్ ను తొలగించుకునేందుకు టూత్ పేస్ట్, ఉప్పు తీసుకొని కాస్త నీరు పోసి కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకునే ముందు ముఖానికి కాస్త ఆవిరిపట్టండి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. కొన్ని రోజుల పాటు ఇలాగే చేస్తే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

ముఖంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించడానికి టూత్‌పేస్ట్, నిమ్మ రసం మరియు ఉప్పు లేదా చక్కెర కలయికను ఉపయోగిస్తే చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మూడిటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం పొందొచ్చు. ఒక టేబుల్ స్పూన్ టూత్ పేస్టులో కొద్దిగా నిమ్మ రసం కలిపి ముఖానికి అప్లై చేసి అరగంటపాటు ఉంచాలి. తరువాత నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై పేరుకున్న దుమ్ము,ధూళి తొలగిపోతుంది.

చర్మం తెల్లబడటంలో టూత్ పేస్టు అద్భుతంగా పనిచేస్తుంది. టానింగ్ కూడుకున్న చర్మానికి ఉపశమనంగా పనిచేయడమే కాకుండా, చర్మం నిగారింపుకు తోడ్పాటుని అందిస్తుంది. కీటకాలు, పురుగులు కుట్టిన చోట పేస్ట్‌ను రాసి మర్దనా చేస్తే నొప్పి, మంట తగ్గుతాయి. టూత్‌పేస్ట్‌ తో గోళ్లను శుభ్రం చేసుకోవచ్చు. దీంతో గోళ్లు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. చర్మ సమస్యలకు చెక్ పెట్టడంలో ఉపయోగరంగా ఉండే టూత్ పేస్ట్ ను అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు అబ్బాయిలు చర్మానికి ఉపయోగించవచ్చు.

గమనిక ; ఈ సమాచారమంతా మాకు అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించింది. చర్మసౌందర్యం కోరుకునేవారు, చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు ఇలాంటి వాటిని వినియోగించే ముందు చర్మవ్యాధి నిపుణుల సూచనలు, సలహాలు తీసుకున్న అన్నతరం పాటించటం మంచిది.