Homemade Oil : సహజసిద్ధమైన వస్తువులతో ఇంట్లో తయారుచేసుకునే ఈ నూనెతో చర్మఛాయను పెంచటంతోపాటు ముడతలు నివారించుకోండి!

ఈ నూనెను తయారు చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సీ జార్ లో గుప్పెడు ఎరుపు రంగు గులాబీ రేకలు, పది పుదీనా ఆకులు, రెండు రెబ్బల కరివేపాకు,పది తులసి ఆకులు,ఒక నిమ్మకాయ తొక్కలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.

Homemade Oil : సహజసిద్ధమైన వస్తువులతో ఇంట్లో తయారుచేసుకునే ఈ నూనెతో చర్మఛాయను పెంచటంతోపాటు ముడతలు నివారించుకోండి!

homemade oil

Homemade Oil : వయస్సు పెరిగే కొద్ది ముఖం మీద ముడతలు,పిగ్మెంటేషన్, చర్మ ఛాయ తగ్గటం వంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి మన ఇంటిలో ఒక నూనెను తయారుచేసుకోవచ్చు. ఈ నూనె చాలా బాగా ఉపకరిస్తుంది. ఇంట్లో సులభంగా దొరికే కొన్ని సహజసిద్దమైన వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా నూనెను తయారుచేసుకోవచ్చు.

నూనె తయారు చేసుకునే విధానం ;

ఈ నూనెను తయారు చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సీ జార్ లో గుప్పెడు ఎరుపు రంగు గులాబీ రేకలు, పది పుదీనా ఆకులు, రెండు రెబ్బల కరివేపాకు,పది తులసి ఆకులు,ఒక నిమ్మకాయ తొక్కలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక కప్పు కొబ్బరి నూనె పోసి కాస్త వేడి అయ్యాక మిక్సీ చేసిన మిశ్రమం వేసి 10 నుంచి 12 నిమిషాలు మరిగించాలి. అనంతరం పావు స్పూన్ పసుపు, అరస్పూన్ అతిమధురం పొడి వేసి మరో 5 నిమిషాలు మరిగించి పొయ్యి ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం చల్లారాక పల్చని వస్త్రం సాయంతో వడకట్టి నిల్వ చేసుకోవాలి.

ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకొని టవల్ తో తుడుచుకొని ఈ నూనెను ముఖానికి రాసి 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయం చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే ముఖం మీద ముడతలు,పిగ్మెంటేషన్ వంటివి క్రమంగా తగ్గుతాయి. ఇలా తయారు చేసుకున్న నూనె దాదాపుగా పది రోజుల పాటు నిల్వ ఉంటుంది. తక్కువ ఖర్చుతో పిగ్మెంటేషన్, ముడతలను తగ్గించుకోవటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.