Bone : ఎముకల పటుత్వానికి క్యాల్షియంతోపాటుగా..

శరీరానికి క్యాల్షియం అవసరముంది. అయితే ఇందుకోసం పెద్ద మొత్తంలో క్యాల్షియం తీసుకుంటే సరిపోదు. దీన్ని గ్రహించటానికి తోడ్పడే విటమిన్ డి3 అవసరం ఉంటుంది.

Bone : ఎముకల పటుత్వానికి క్యాల్షియంతోపాటుగా..

Bones

Bone : మనిషిలో ఎముకలు పటుత్వంగా ఉంటే ఆరోగ్యవంతులుగా ఉన్నట్లేనని చెప్పవచ్చు. ఎముకల ఆరోగ్యానికి, దృఢత్వానికి ముఖ్యంగా కాల్షియం, విటమిన్‌ డి చాలా అవసరం. వీటితో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌ కె ఎముకల నిర్మాణానికి, ఎముకలు పెళుసుబారకుండా ఉండడానికి అత్యవసరం.

పాలు, పెరుగు ముఖ్యమైన కాల్షియాన్ని, ఫాస్ఫరస్‌ను అందిస్తాయి. కొన్ని రకాల ఆకు కూరల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. పప్పు ధాన్యాల నుంచి, పాలు, పాల ఉత్పత్తుల నుంచి కూడా మనకు మాంసకృత్తులు లభిస్తాయి. విటమిన్‌ డి సూర్యరశ్మిలో తిరగడం వల్ల లభిస్తుంది. అలాగే ఈ విటమిన్‌ డి తో ఫోర్టిఫై చేసిన పాలను తీసుకోవడం వల్ల కాల్షియం, విటమిన్‌ – డి రెండూ లభిస్తాయి.

శరీరానికి క్యాల్షియం అవసరముంది. అయితే ఇందుకోసం పెద్ద మొత్తంలో క్యాల్షియం తీసుకుంటే సరిపోదు. దీన్ని గ్రహించటానికి తోడ్పడే విటమిన్ డి3 అవసరం ఉంటుంది. విటమిన్ డిస్ధాయి శరీరంలో తగ్గకుండా చూసుకోవాలి. రోజు శరీరానికి ఎండతగిలేలా చూసుకుంటే డి3 విటమిన్ అందుతుంది.

ఎముకలు గుల్ల బారినవారిలో విటమిన్‌ కె ఎముక సాంద్రత పెరిగేలా చేస్తున్నట్టు, ఎముక విరిగిపోయే ముప్పు తగ్గుతుంది. పాలకూర, తోటకూర వంటి ఆకు కూరలు, గోబీ పువ్వు, క్యాబేజీ, చేపలు, కాలేయం, మాంసం, గుడ్ల వంటి వాటితో విటమిన్‌ కె లభిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు నిత్యం వ్యాయామం చేస్తుంటే ఎముకలతో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం.