Curry Leaves : కంటి సమస్యలతోపాటు, చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే కరివేపాకు!

బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. కరివేపాకు ఆకులను మెత్తగా నూరి గడ్డలు, పొక్కులకు పైపూతగా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Curry Leaves : కంటి సమస్యలతోపాటు, చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే కరివేపాకు!

Curry Leaves

Curry Leaves : కరివేపాకులో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. మన శరీరానికి అనేక ప్రయోజానాలు అందించటంలో కరివేపాకు సహాయకారిగా పనిచేస్తుంది. నిత్యం ప్రతి ఇంట్లో కూరల్లో మంచి సువాసన, రుచి రావటానికి కరివేపాకును ఉపయోగిస్తుంటారు. కరివేపాకును ఏదో ఒక రకంగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు ఏరూపంలోనైనా ప్రతిరోజు కరివేపాకు తీసుకోవటం వల్ల సమస్యను తొలగించుకోవచ్చు. ఆకుల్లో ఉండే విటమిన్ -A కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.

కరివేపాకులో ఉండే అమైనో ఆమ్లాలు గుండె కండరాలకు మేలు చేస్తాయి. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కరివేపాకు పొడిలో ఉండే పీచు మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కంటి సమస్యలు ఉన్నవాళ్లకు, దృష్టిలోపం పెరగకుండా ఉండటానికి ఇది చాలా మంచిది. కాలేయ సమస్యలను తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడి, నరాల బలహీనతలకు కరివేపాకు చక్కని ఔషదంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. కరివేపాకు ఆకులను మెత్తగా నూరి గడ్డలు, పొక్కులకు పైపూతగా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకు ఆకులను నీడలో ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఆ పొడిలో రెండు నిమ్మకాయలు పిండి, కాస్త ఉప్పు, కారం వేసి చివరగా తాలింపు వేసుకుంటే అన్నం, ఇడ్లీల్లోకి చాలా బాగుంటుంది. ఇలా చేస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలోని బ్యాడ్ ఫ్యాట్ ను కరిగిస్తుంది. బరువు తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.

కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ లేదా పేస్ట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం, మజ్జిగలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కొవ్వు కరిగించుకోవడంతో పాటు, బరువు తగ్గించుకోవచ్చు. పిండి పదార్ధాలను గ్లూకోజ్‌గా మార్చడాన్ని నివారించడంలోనూ సహాయపడుతుంది. జుట్టు ఊడిపోవటం, తెల్లగా మారటం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారి ఆహారంలో కరివేపాకును తీసుకోవటం మంచిది. కరివేపాకును జ్యూస్ గా మార్చి, మజ్జిగలో కలుపుకుని తాగటం వల్ల యూరినరీ సమస్యలు తొలగిపోతాయి. చర్మం ముడతలు తొలగించి వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా చేస్తుంది.