Papaya : బరువు తగ్గించటంతోపాటు, జీర్ణప్రక్రియను వేగవంతం చేసే బొప్పాయి! |In addition to losing weight, papaya can speed up digestion!

Papaya : బరువు తగ్గించటంతోపాటు, జీర్ణప్రక్రియను వేగవంతం చేసే బొప్పాయి!

బొప్పాయిలో పపైన్ మరియు కైమోపపైన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతే కాకుండా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు బొప్పాయి ఆకులను ఉపయోగిస్తారు.

Papaya : బరువు తగ్గించటంతోపాటు, జీర్ణప్రక్రియను వేగవంతం చేసే బొప్పాయి!

Papaya : బొప్పాయి పండు ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది. బొప్పాయిలో కొవ్వులు, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజు ఈపండ్ల ముక్కలను తీసుకోవచ్చు. బొప్పాయి తినే వారిలో జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఉదర సంబంధిత సమస్యలున్న వారు దీనిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చిగుళ్ల ఆరోగ్యానికి మంచిది. రక్తహీనత సమస్యల నుండి దీనిని తినటం ద్వారా బయటపడవచ్చు. నోటిపూత వంటి సమస్యలను దరి చేరకుండా చేస్తుంది.

ముఖ్యంగా పొట్టకు సంబంధించిన వ్యాధులని దూరం చేస్తుంది. వాస్తవానికి బొప్పాయి ఖాళీకడుపుతో తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం అల్పాహారం సమయానికి ముందు బొప్పాయి తీసుకోవటం వల్ల మేలు కలుగుతుంది. అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

బొప్పాయి వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అంతే కాకుండా ప్రతిరోజూ ఆహారంలో బొప్పాయిని చేర్చుకుంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. చర్మానికి బొప్పాయి వల్ల కలిగే మేలు అంతాఇంతాకాదు. బొప్పాయి తినడం వల్ల చర్మం మెరిసిపోతుంది. ఇందులో యాంటీ ఏజింగ్‌ లక్షణాలు ఉంటాయి.

బొప్పాయిలో పపైన్ మరియు కైమోపపైన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతే కాకుండా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు బొప్పాయి ఆకులను ఉపయోగిస్తారు. ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉంటే బొప్పాయి ఆకులు సంజీవనిగా పని చేస్తాయి. బొప్పాయిలో ఫైబ్రిన్ అనే పదార్థం రక్తం గడ్డకట్టటాన్ని తగ్గించి రక్తం సాఫీగా సరఫరా అయ్యేలా చేస్తుంది. బొప్పాయి పొట్టకు చాలా మేలు చేస్తుంది.

జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. చుండ్రుని నియంత్రించే శక్తి బొప్పాయికి ఉంది. బొప్పాయితో చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. చర్మంపై ముడతలను తగ్గించవచ్చు. పాలిచ్చే తల్లులకు బొప్పాయి చాలా మంచిది. బొప్పాయి తింటే కొందరికి అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి, అలాంటివారు వాటికి దూరంగా వుండటం మంచిది.

 

×