Asafoetida Benifits : రక్తపోటును తగ్గించటంతోపాటు, జ్ణాపకశక్తిని పెంచే ఇంగువ!

మూలికా వైద్యంలో , బ్యాక్టీరియా, శిలీంద్రాలకు వ్యతిరేక చికిత్స కోసం దీనిని ఉపయోగిస్తారు. బరువును తగ్గాలనుకునే వారు రోజువారి ఆహారంలో ఇంగువ చేర్చుకోవటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కొవ్వులను కరిగిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపర్చటం ద్వారా జ్ణాపక శక్తి పెరిగేలా చేస్తుంది.

Asafoetida Benifits : రక్తపోటును తగ్గించటంతోపాటు, జ్ణాపకశక్తిని పెంచే ఇంగువ!

asafoetida benifits

Asafoetida Benifits : ఆయుర్వేదంలో ఇంగువకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిలో అనేక ఔషదగుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణక్రియలో ఇంగువ కీలకంగా ఉపయోగపడుతుంది. కడుపులో గ్యాస్ వంటి సమస్యలకు ఇది చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. జీర్ణాశయంలోని విషపదార్ధాలను తొలగిస్తుంది. అంతేకాకుండా రోజువారి ఆహారంలో తగిన మోతాదులో తీసుకుంటే మలబద్ధకం, అంతిసారం, కడుపులో తిమ్మిరి వంటివి తగ్గుతాయి. ఇంగువ వాడకం వల్ల లాలాజంల, గ్యాస్ట్రిక్ రసాల విడుదలను పెంచుటంలో తోడ్పడుతుంది.

మూలికా వైద్యంలో , బ్యాక్టీరియా, శిలీంద్రాలకు వ్యతిరేక చికిత్స కోసం దీనిని ఉపయోగిస్తారు. బరువును తగ్గాలనుకునే వారు రోజువారి ఆహారంలో ఇంగువ చేర్చుకోవటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కొవ్వులను కరిగిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపర్చటం ద్వారా జ్ణాపక శక్తి పెరిగేలా చేస్తుంది. అధిక రక్తపోటును తగ్గించటంలో ప్రభావ వంతంగా తోడ్పడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. మూత్రపిండాల పనితీరును ప్రోత్సహిస్తుంది.

అయితే ఇంగువను అధిక మోతాదులో వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఇంగువను అధిక మోతాదులో వాడటం వల్ల మైకం, తలనొప్పి వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అంతేకాకుండా ఇది గిట్టని వారికి చర్మం పై దద్దుర్లు , వాపు వంటివి వస్తాయి. ఆసమయంలో వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఇంగువ తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకోవటం వల్ల కొన్ని సందర్భాల్లో గర్భాస్రావానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఇంగువను తీసుకోక పోవటమే మంచిది.