Sapota : పోషకాలను అందించటంతోపాటు, ఒత్తిడిని పోగొట్టే సపోటా!

ముఖ్యంగా వివిధ రకాల పని ఒత్తిడులతో గడిపే వారు సపోటా పండ్లు తినటం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నరాలకు సంబంధించి ఒత్తిడులు, ఆందోళన వంటి వాటికి మంచి ఉపశమనం కలిగిస్తాయి.

Sapota : పోషకాలను అందించటంతోపాటు, ఒత్తిడిని పోగొట్టే సపోటా!

Sapota

Sapota : ఆరోగ్యానికి మేలు చేయటంతోపాటు, శరీరానికి కావాల్సిన పోషకాలను అందించటంలో దోహదపడే పండ్లలో సపోట కూడా ప్రధానమైనది. చిన్నారుల నుండి పెద్దల వరకు సపోటా పండును ఇష్టంగా ఉంటారు. రుచికి తియ్యగా ఉండే సపోటా తేనె రుచిని కలిగి ఉంటుంది. సపోటాలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కంటి చూపును మెరుగు పరచటంలో ఎంతో ఉపయోగపడుతుంది. సపోటా గుజ్జుకు తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే గుణం ఉంది. అందుకే చిన్నపిల్లలకు సపోటా గుజ్జును తినిపిస్తుంటారు.

సపోటాలో తక్షణ శక్తినిచ్చే గ్లూకోజ్ లభిస్తుంది. ముఖ్యంగా వ్యాయామాలు అధికంగా చేస్తూ శక్తిని కోల్పోయే క్రీడాకారులకు సపోటా పండ్లు తినమని సూచిస్తుంటారు. ఎందుకంటే సపోటా తినటం వల్ల త్వరగా కోల్పోయిన శక్తిని పొందేందుకు అవకాశం ఉంటుంది. సపోటాలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకల గట్టితనానికి, పెరుగుదలకు సహాయపడుతుంది. పిండిపదార్ధాలు, పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండటం వల్ల గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు మంచిది.

ముఖ్యంగా వివిధ రకాల పని ఒత్తిడులతో గడిపే వారు సపోటా పండ్లు తినటం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నరాలకు సంబంధించి ఒత్తిడులు, ఆందోళన వంటి వాటికి మంచి ఉపశమనం కలిగిస్తాయి. స్ధూలకాయ సమస్య ఉన్న వారు సపోటా తినటం వల్ల కొంతమేర బరువును తగ్గించుకోవచ్చు. సపోటాలో ఉండే విటమిన్ ఇ చర్మన్ని కాంతి వంతంగా మారుస్తుంది. చర్మాన్ని మృధువుగా ఉంచుతుంది. జుట్టురాలటాన్ని నివారించి ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడుతుంది. సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.